సోమవారం 26 అక్టోబర్ 2020
Mahabubabad - Aug 07, 2020 , 03:57:34

సార్‌ స్మరణలో..

సార్‌ స్మరణలో..

  • జిల్లాలో ఘనంగా జయశంకర్‌ సార్‌ జయంతి
  • నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, అధికారులు

మహబూబాబాద్‌ రూరల్‌ : రాష్ర్టానికి ఆదర్శప్రాయుడు జయశంకర్‌సార్‌ అని జడ్పీ చైర్‌పర్సన్‌ బిందు అన్నారు. జడ్పీ కార్యాలయంలో సార్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆమె మాట్లాడారు. ప్రతి ఒక్కరూ జయశంకర్‌ సార్‌ను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాము వ్వాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో సన్యాసయ్య, విద్యాలత, సూపరింటెండెంట్‌ నర్సింగారావు పాల్గొన్నారు. 

తొర్రూరు: డివిజన్‌ కేంద్రంలో జయశంకర్‌ సార్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. తొర్రూరు మున్సిపల్‌ కార్యాలయం లో మున్సిపల్‌ చైర్మన్‌ మంగళపల్లి రామచంద్రయ్య, కమిషనర్‌ గుండె బాబు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు క్యాంపు కార్యాలయంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు మాట్లాడుతూ..జయశంకర్‌ సార్‌ తెలంగాణ సాధన కోసం ఎంతో పరితపించారన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రం థాలయ సంస్థ డైరెక్టర్‌, పట్టణ అధ్యక్షుడు రామిని శ్రీనివాస్‌, మండల రైతు బంధు కన్వీనర్‌ దేవేందర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ సురేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు ఎం.నట్వర్‌, వెంకటనారాయణగౌడ్‌, ఎస్‌.ఐలయ్య, కుర్ర శ్రీనివాస్‌, ప్రమోద్‌, మల్లయ్య, తొర్రూరు ప్రభుత్వ దవాఖానలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ కోటా చలం, డాక్టర్‌ నిరంజని, గౌతమి డిగ్రీ కళాశాలలో శ్రీవాణి ఎడ్యుకేషన్‌ అండ్‌ సోషల్‌ సర్వీస్‌ సొసైటీ వ్యవస్థాపకురాలు డాక్టర్‌ నాగవాణి జయశంకర్‌ సార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జయశంకర్‌ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ ఆధ్వర్యంలో అమ్మాపురం రోడ్డులో నిర్వహించిన కార్యక్రమంలో అధ్యక్ష, కార్యదర్శులు దేవరకొండ కృష్ణప్రసాద్‌, విక్రమ్‌కుమార్‌, విశ్వబ్రాహ్మణ సంఘ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌, శ్రీనివాసచారి, పూర్ణాచారి సార్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  తొర్రూరు ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో ఈశ్వరయ్య ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ రమేశ్‌బాబు, ఆర్డీవో, తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. 

మరిపెడ :మున్సిపల్‌ ఆఫీస్‌, మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో జయశంకర్‌ సార్‌ జయంతిని వేర్వేరుగా నిర్వహించారు. ఎంపీపీ అరుణ అన్నారు. మున్సిపల్‌ ఆఫీస్‌లో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ సింధూరకుమారి, మండల పరిషత్‌లో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ అరుణ సార్‌ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నేటి యువతకు స్ఫూర్తి ప్రదాత జయశంకర్‌ సార్‌ అని అన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు రాంబాబు, మున్సిపల్‌ కమిషనర్‌ సత్యనారాయణరెడ్డి, వైస్‌ ఎంపీపీ అశోక్‌రెడ్డి, సర్పంచ్‌ బీక్కునాయక్‌, కౌన్సిలర్లు ప్రగతి, కిషన్‌నాయక్‌, శ్రీనివాస్‌, కోఆప్షన్‌ సభ్యులు మక్సూద్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

మహబూబాబాద్‌ టౌన్‌: పట్టణంలోని నలంద డిగ్రీ కాలేజీలో జయశంకర్‌ సార్‌ జయంతిని నిరాడంబరంగా నిర్వహించారు. కరస్పాండెంట్‌ డాక్టర్‌ డోలి సత్యనారాయణ  సార్‌ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళలర్పించారు. కార్యక్రమంలో పరమాత్మాచారి, రవీందర్‌, నాగేశ్వర్‌, పాషా, దాసు పాల్గొన్నారు. 23వ వార్డులో కౌన్సిలర్‌ శ్రీదేవి రఘు జయశంకర్‌ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అడ్వకేట్‌ ఎం సత్యనారాయణ, పొలిశెట్టి సంపత్‌, వాహీద్‌, కుమ్మరికుంట్ల సత్యనారాయణ, కే సత్యనారాయణ పాల్గొన్నారు. 

కేసముద్రంటౌన్‌ : కేసముద్రం మండలకేంద్రంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు దామరకొండ ప్రవీణ్‌కుమార్‌, జడ్పీటీసీ శ్రీనాథ్‌రెడ్డి జయశంకర్‌ సార్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, కేసము ద్రం స్టేషన్‌ సర్పంచ్‌ శ్రీను, నాయకులు రమేశ్‌, రవీందర్‌రెడ్డి, నజీర్‌ అహ్మద్‌, వీరునాయక్‌, వెంకన్న, రాహుల్‌ పాల్గొన్నారు.

కురవి: మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ విజయ్‌కుమార్‌, రెవెన్యూ సిబ్బంది జయశంకర్‌ సార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

బయ్యారం :మండలపరిషత్‌ కార్యాలయం,ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎంపీపీ మౌనిక, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షు డు బుచ్చిరెడ్డి జయశంకర్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీడీవో చలపతిరావు, ఎంపీటీసీ భద్ర య్య, టీఆర్‌ఎస్‌ నాయకులు సోందు, వెంకన్న పాల్గొన్నారు.

గార్ల : మండలకేంద్రంలోని జయశంకర్‌ సార్‌ విగ్రహానికి టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రాధాకృష్ణ, ఎంపీపీ శివాజీ నాయక్‌, సర్పంచ్‌ బన్సీలాల్‌నాయక్‌ పూల మాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ అమరవీరుల కూడలిలో టీవీవీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విశ్వ, జిల్లా నాయకుడు నాగేశ్వరరావు, మండల నాయకుడు మురళి సార్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో గుండ వెంకటరెడ్డి, కోల కుమార్‌ గౌడ్‌, దశరథ్‌, కొమురయ్య, జంగం శ్రీను, పచ్చాపాల భిక్షం, మేళ్లచెరువు ప్రసాద్‌, ప్రవీణ్‌బాబు, వీరన్న పాల్గొన్నారు.

నర్సింహులపేట: మండలకేంద్రంలో జయశంకర్‌ సార్‌ జ యంతిని ఘనంగా నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ యూత్‌ సభ్యులు సార్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ యూత్‌ మండల అధ్యక్షుడు బండి రమేశ్‌, ఉప సర్పంచ్‌ కార్ల నాగన్న, పార్టీ గ్రామ అధ్యక్షుడు జగదీశ్వర్‌, నాయకులు నరేశ్‌, పాషా, రాజు, భీముడు పాల్గొన్నారు.

దంతాలపల్లి: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో గోవిందరావు, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్‌ మల్లారెడ్డి జయశంకర్‌సార్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీవో అప్సార్‌పాషా, ఏపీవో మాధవి తదితరులు పాల్గొన్నారు. 

పెద్దవంగర: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం లో, టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో, మండల విశ్వకర్మ సం ఘం ఆధ్వర్యంలో, ఉప్పరగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో జయశంకర్‌ సార్‌ జయంతి కార్యక్రమాలను వేర్వేరుగా నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ ఈదురు రాజేశ్వరి, తహసీల్దార్‌ యోగేశ్వర్‌రావు, ఎంపీడీవో అపర్ణ, ఎస్సై జితేందర్‌, ఇన్‌చార్జి ఏవో కుమార్‌యాదవ్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ఐలయ్య, పాలకుర్తి దేవస్థాన చైర్మన్‌ రామచంద్రయ్యశర్మ, సర్పంచ్‌ జమున, ఏఎస్సై కుమారస్వామి, ఎంపీవో యాకయ్య, ఏఈవో ఆయేషా, టీఆర్‌ఎస్‌ నాయకులు శ్రీనివాస్‌, సుధీర్‌కుమార్‌, సంజయ్‌, లింగమూర్తి, రవి, ఉపేందర్‌రెడ్డి, సమ్మయ్య, స్వేరోస్‌, విశ్వకర్మ సంఘం నాయకులు పాల్గొన్నారు.

చిన్నగూడూరు: మండలకేంద్రంలోని ఎంపీడీవో, తహసీల్‌ కార్యాలయంలో జయశంకర్‌ సార్‌ జయంతి సందర్భంగా ఆయ న చిత్రపటానికి పులువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ పద్మావెంకటరెడ్డి తహసీల్దార్‌ అనురాదాభాయి, ఎంపీడీవో సరస్వతి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రాంసింగ్‌, నాయకులు మురళీధర్‌రెడ్డి, చెన్నయ్య, చెన్నారెడ్డి, వైస్‌ ఎంపీపీ పిల్లి వీరన్న, సర్పంచ్‌లు జ్యోతిరాము, మల్లయ్య, కోఆప్షన్‌ సభ్యులు మూసిన్‌బేగ్‌, ఉపేందర్‌, జ్ఞానేశ్వర్‌, నెహ్రూ పాల్గొన్నారు.


logo