బుధవారం 30 సెప్టెంబర్ 2020
Mahabubabad - Aug 06, 2020 , 04:11:24

బంగారు తెలంగాణ సాధనే కేసీఆర్‌ లక్ష్యం

బంగారు తెలంగాణ సాధనే కేసీఆర్‌ లక్ష్యం

మహబూబాబాద్‌, ఆగస్టు 5: బంగారు తెలంగాణ సాధనే ముఖ్య మంత్రి కేసీఆర్‌ లక్ష్యమని మహబూబాబాద్‌ ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మస్తున్న కలెక్టర్‌ భవన సముదాయ పనులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలవద్దకు పాలన తీసుకురావాలనే ఉద్దేశంతో జిల్లాల పనఃర్విభజన చేపట్టారని అన్నారు. జిల్లాల ఏర్పాటుతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి సాధిస్తున్నాయని అన్నారు. జిల్లా కార్యాలయాలు భావితరాలకు ఉపయోగ పడుతాయని అన్నారు. అందుకు భవన నిర్మాణ పనుల్లో నాణ్యత ఉండాలని అధికారులు, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఆయన వెట తహసీల్దార్‌ రంజిత్‌, టీఆర్‌ఎస్‌ అర్బన్‌ యూత్‌ అధ్యక్షుడు యాళ్ల మురళీదర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

తెలంగాణలో రామన్న రాజ్యం నడుస్తున్నది

గూడూరు: తెలంగాణ రాష్ట్రంలో రాముడు కలలుగన్న రామరాజ్యం నడుస్తున్నదని మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ అన్నారు. మండలంలోని బొద్దుగొండ, గుండెంగ గ్రామాలలో రైతవేదిక భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో అలనాటి శ్రీరాముడి పాలన కొనసాగుతున్నదని అన్నారు. రాష్ట్రంలో రైతులు నియంత్రిత సాగు చేయడం రాష్ర్టానికే కాకుండా దేశానికి ఆదర్శమని, నియంత్రిత సాగుతో రైతు పండించుకున్న పంటకు గిట్టుబాటు ధర పొందవచ్చని అన్నారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో రైతులు జాగ్రత్తగా ఉండాలని, నిబంధనలు పాటించి వ్యవసాయ పనులను చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ డీఈ రాజ్‌కుమార్‌, ఏవో రాకేశ్‌, వైస్‌ ఎంపీపీ ఆరె వీరన్న, జడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు ఖాసీం, సర్పంచులు ముక్కా లక్ష్మణ్‌రావు, కందిక స్వామి, ఎంపీటీసీలు బోడ కిషన్‌, గుర్రం కవిత, టీఆర్‌ఎస్‌ మండల కార్యదర్శి జిల్లా యాకయ్య, నాయకులు చీకటి శ్రీనివాస్‌, మధ్యా తదితరులు పాల్గొన్నారు.


logo