మంగళవారం 27 అక్టోబర్ 2020
Mahabubabad - Aug 05, 2020 , 05:39:25

పేదల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

పేదల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

కేసముద్రంటౌన్‌:పేద ప్రజల అభివృద్ధే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ అన్నారు. మండల కేంద్రంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో మంగళవారం పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు ఆరోగ్యశ్రీలో లేని జబ్బులకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా డబ్బులు అందిస్తున్నట్లు తెలిపారు. కరోనా పరిస్థితుల్లోనూ మహబూబాబాద్‌ నియోజకవర్గంలో 75 మం దికి సుమారు రూ.35 లక్షలు సీఎం ఆర్‌ఎఫ్‌ ద్వారా అందించినట్లు చెప్పారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్నందున ప్రజలు అనవసరంగా బయటకు రావొద్దని, మాస్కులు ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించాలని సూచించారు. కరోనా వచ్చిన వారు భయపడాల్సిన పనిలేదని, ప్రభుత్వం నాణ్యమైన వైద్యం అందిస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఓలం చంద్రమోహన్‌, జడ్పీటీసీ రావుల శ్రీనాథ్‌రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌, రాష్ట్ర నాయకుడు నారాయణ్‌రావు, సర్పంచ్‌లు శ్రీను, యాకయ్య, నాయకులు కముటం శ్రీను, శ్రీనివాస్‌రెడ్డి, పిచ్చయ్య, వీరూనాయక్‌, మహేశ్వరాచారి తదితరులు పాల్గొన్నారు. logo