సోమవారం 21 సెప్టెంబర్ 2020
Mahabubabad - Aug 05, 2020 , 03:17:32

కొవిడ్‌ నియంత్రణకు సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ

కొవిడ్‌ నియంత్రణకు సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ

మహబూబాబాద్‌, నమస్తే తెలంగాణ : రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నా మరణాల సంఖ్య పెరుగకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక చర్యలు తీసుకుంటున్నారని గిరిజన, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. మంగళవారం కలెక్టర్‌ సమావేశ మందిరంలో కొవిడ్‌ బాధితులకు నిర్మాణ్‌ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో కలిసి మంత్రి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  వల్ల  చిన్నచిన్న ఇబ్బందులు వస్తుంటాయన్నారు. వీటిని భూతద్దంలో చూపించి, ప్రతిపక్షాలు పబ్బం గడుపుకుంటున్నాయని విమర్శించారు. జిల్లాలో 450 మంది బాధితులకు నిర్మాణ్‌ సంస్థ నిత్యావసరాలు  చేయడం అభినందనీయమన్నారు.  కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ ఆంగోత్‌ బిందు, నిర్మాణ్‌ సంస్థ ప్రతినిధి మయూర్‌ పట్నాల తదితరలు పాల్గొన్నారు. 


logo