ఆదివారం 09 ఆగస్టు 2020
Mahabubabad - Aug 02, 2020 , 07:51:38

అసత్య ప్రచారాలు నమ్మొద్దు

అసత్య ప్రచారాలు నమ్మొద్దు

  • పట్టణంలో ఎలాంటి లాక్‌డౌన్‌ విధించలేదు
  • మున్సిపల్‌ కమిషనర్‌ ఇంద్రసేనారెడ్డి

మహబూబాబాద్‌ రూరల్‌: పట్టణంలో ఆగస్టు 1 నుం చి 31వ తేదీ వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌ ఉంటుందని కొం తమంది వాట్సాప్‌ గ్రూప్‌ల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ప్రజలు వాటిని నమ్మొద్దని మున్సిపల్‌ కమిషనర్‌ ఇంద్రసేనారెడ్డి, సీఐ రవి కుమార్‌, తహసీల్దార్‌ రంజిత్‌ కుమార్‌ అన్నారు. శనివారం తహసీల్దార్‌ కార్యాలయం లో కొవిడ్‌-19 నిబంధనల పత్రాన్ని వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర ప్రభు త్వం విధించిన లాక్‌డౌన్‌ నిబంధనలు తప్ప.., ఎలాంటి ఎక్కడా ఎలాంటి లాక్‌డౌన్‌ విధించలేదన్నారు. వ్యాపారస్తులు, ప్రజలు యథావిధిగా వారి వారి కార్యకలాపాలను మాస్క్‌లు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ కొనసాగించుకోవచ్చన్నారు. లాక్‌డౌన్‌ విధించే అధికారం కేవలం ప్రభుత్వానికి మాత్రమే ఉందన్నారు. సోషల్‌ మీడియా ల్లో అసత్య ప్రచారాలు చేసిన వారిపై, గ్రూప్‌ అడ్మిన్‌లపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. logo