శనివారం 05 డిసెంబర్ 2020
Mahabubabad - Jul 16, 2020 , 01:21:16

మెరుగైన వైద్యం అందించాలి

మెరుగైన వైద్యం అందించాలి

 మహబూబాబాద్‌, నమస్తే తెలంగాణ : జిల్లాలో కరోనా పాజిటి వ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రత్యే క చర్యలు తీసుకోవాల ని, అదే విధంగా కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, గిరిజన, స్త్రీ, శిశు, సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మంత్రి నివాసంలో జిల్లాలో కరోనా పరిస్థితులపై జిల్లా వైద్య అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఎలాం టి వసతులు కావాలో వైద్యులు సూచిస్తే వెంటనే అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అంతేకాకుండా వైద్యం అందించే డాక్టర్లకు కావాల్సిన పీపీఈ కిట్స్‌, కనీస సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు.

పాజిటివ్‌ నిర్ధారణ అయి హోం ఐసోలేషన్‌లో ఉంటున్న వారికి ప్రభుత్వమే ఐసోలేషన్‌ కిట్స్‌ అందిస్తుందని, వాటిని బాధితులకు సరైన సమయంలో అందేలా చూ డాలని అధికారులను ఆదేశించారు. ఐసోలేషన్‌లో ఉన్న వ్యక్తి కుటుంబంపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. వారి వ్యక్తిగత నివేదికలు రూపొందించాలన్నారు. కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వారికి అవగాహన కల్పించాలన్నా రు. పాజిటివ్‌ నిర్ధారైన వారు త్వరగా కోలుకునేలా చర్యలు తీసు కోవ డంతో పాటు మనోధైర్యం కల్పించాల న్నా రు. ప్రత్యేక కౌన్సెలింగ్‌ ఇవ్వాలన్నారు. కరోనా వచ్చి కోలుకొని క్షేమంగా బయటపడిన వారే జిల్లాలో అత్యధికంగా ఉన్నారని, కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య తక్కువగా ఉందన్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిందనగానే కంగారు పడకుండా ధైర్యంగా వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ శ్రీరాం, జిల్లా ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్‌ భీమ్‌సాగర్‌, నోడల్‌ అధికారి డాక్టర్‌ సతీశ్‌రాథోడ్‌ తదితరులు పాల్గొన్నారు.