గురువారం 13 ఆగస్టు 2020
Mahabubabad - Jul 13, 2020 , 01:48:24

జిల్లాలో మరో ఏడు కరోనా కేసులు

జిల్లాలో మరో ఏడు కరోనా కేసులు

మహబూబాబాద్‌ టౌన్‌ : జిల్లాలో మరో ఏడు కరోనా కేసులు నమోదైన ట్లు జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ రాజేశ్‌ తెలిపారు. మహబూబాబాద్‌ మం డలం రెడ్యాల, డోర్నకల్‌ రాజు తండాల్లో ఒక్కొక్కటి చొప్పున, గూడూరు మండల కేంద్రంలో రెండు, కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామంలో మూడు పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఆయన తెలిపారు. వీటితో కలుపుకొని జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 61కి పెరిగిందన్నారు. ఏడుగురు వ్యక్తులు హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు ఆయన చెప్పారు. 

తాళ్లపూసపల్లిలో ముగ్గురికి..

కేసముద్రంటౌన్‌: మండలంలోని తాళ్లపూసపల్లి గ్రామంలో ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తహసీల్దార్‌ వెంకట్‌రెడ్డి, పీహెచ్‌సీ వైద్యుడు విజయ్‌ తెలిపారు. మహబూబాబాద్‌ మండలం రెడ్యాలకు చెందిన వ్యక్తి, తాళ్లపూసపల్లికి చెందిన ముగ్గురు వ్యక్తులు గత నెల 29 హైదరాబాద్‌ నుంచి వారి స్వగ్రామాలకు వచ్చారు. ఈ నెల 3న రెడ్యాలకు చెందిన వ్యక్తికి పాజిటివ్‌ రాగానే, అప్రమత్తమైన కేసముద్రం అధికారులు తాళ్లపూసపల్లికి చెందిన ముగ్గురితోపాటు వారి బంధువులను హోం క్వారంటైన్‌లో ఉంచి నమూనాలను టెస్టులకు పంపారు. ఐదుగురి వ్యక్తుల ఫలితాలు రాగా, అందు లో ముగ్గురికి పాజిటివ్‌ వచ్చిందని వారు తెలిపారు. 

గూడూరులో ఇద్దరు కానిస్టేబుల్స్‌కు..

గూడూరు: ఇద్దరు కానిస్టేబుళ్లకు పాజిటివ్‌ వచ్చినట్లు కొవిడ్‌-19 జిల్లా అధికారి రాజేశ్‌ తెలిపారు. గూడూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఇద్దరు కానిస్టేబుళ్లు దగ్గు, జ్వరంతో బాధపడుతుండగా, మూడు రోజుల క్రితం నమూనాలు సేకరించి టెస్టుల కోసం పంపారు. ఇద్దరికీ పాజిటివ్‌ వచ్చింది. వారితో కాంటాక్టులో ఉన్న వారికి కూడా పరీక్షలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. logo