శనివారం 08 ఆగస్టు 2020
Mahabubabad - Jul 13, 2020 , 01:42:44

వహ్వారే.. ‘బాహుబలి’

వహ్వారే.. ‘బాహుబలి’

  • అడవి ఒడిలో కట్టిపడేస్తున్న జలపాతం
  • తాజా వర్షాలకు దుంకుతూ కనువిందు
  • బయ్యారం మండలం చింతోనిగుంపు సమీపంలో ఆహ్లాదకర ప్రదేశం


బయ్యారం: మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలంలోని చింతోనిగుంపు సమీపంలో ఉన్న  జలపాతం పర్యాటకులను కనువిందు చేస్తున్నది. నల్లని రాతిపై తెల్లని ముత్యాలు దొర్లినట్లుగా నీటి ప్రవాహం.. పచ్చని అడవి మధ్యలో నీటి సవ్వడితో ప్రకృతి రమణీయత చూపరులను ఆకట్టుకుంటున్నది. ఎంతసేపు చూసినా తనివితీరని తన అందాలతో జలపాతం కట్టిపడేస్తున్నది. అయితే, స్థానికులు ఈ జలపాతాన్ని మనమబోతుల, వంకమడుగు అనే పేర్లతో సంబోధిస్తారు. మరికొందరు బయ్యారం బాహుబలి జలపాతం అంటూ ముద్దుగా పిలుచుకుంటున్నారు. వర్షాకాలంలో మాత్రమే నీటి ప్రవాహం ఉండే ఈ జలపాతాన్ని జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన వారు సందర్శిస్తుంటారు.


logo