మంగళవారం 11 ఆగస్టు 2020
Mahabubabad - Jul 07, 2020 , 03:42:53

అవయవ దానంతో జన్మసార్థకం

అవయవ దానంతో జన్మసార్థకం

తొర్రూరు: అవయవ దానంతో మానవ జన్మకు సార్థకత లభిస్తుందని తెలంగాణ నేత్ర, అవయవ దాతల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్‌ పరికిపండ్ల అశోక్‌ అన్నారు. తొర్రూరు మున్సిపాలిటీ సిబ్బంది వెంకటయ్య ఇటీవల మృతిచెందగా, అతడి నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం తెలంగాణ నేత్ర అవయవ దాతల సంఘం ఆధ్వర్యంలో మహంకాళి వీరన్న అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రామచంద్రయ్య, కమిషనర్‌ గుండె బాబు తో కలిసి ప్రభుత్వం అందించిన నేత్రదానం ధ్రువీకరణ పత్రాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గణిత ఫోరం జిల్లా అధ్యక్షుడు మచ్చ సోమన్న, మంగళపల్లి స్వామి పాల్గొన్నారు.logo