శనివారం 04 జూలై 2020
Mahabubabad - Jul 01, 2020 , 03:02:31

ఉరూరా ఉత్సాహంగా..

ఉరూరా ఉత్సాహంగా..

జిల్లాలో ఉద్యమంలా హరితహారం

ఆరో విడుత హరితహారం కార్యక్రమం మంగళవారం జిల్లాలో జోరుగా సాగింది. పచ్చని పండుగకు పల్లె, పట్నం జాతరలా  కదిలాయి. చిన్నాపెద్దా, పిల్లా జెల్లా, అధికారులు, ప్రజాప్రతినిధులు ఉద్యమంలా కదిలి.. ఖాళీ ప్రదేశాలు, రోడ్లకు ఇరువైపులా, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో మొక్కలు నాటారు. వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ కోటిరెడ్డి మొక్కలు నాటి నీరు పోశారు.

ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి 

జెడ్పీ చైర్‌పర్సన్‌ బిందు 

బయ్యారం: హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జెడ్పీ చైర్‌పర్సన్‌ అంగోత్‌ బిందు అన్నారు. మంగళవారం మండలంలోని లక్ష్మీనర్సింహాపురం, నర్సాతండా గ్రామాల్లో ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం తలపెట్టిన హరితహారం కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చెర్మన్‌ మధుకర్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ పద్మ, మండల ప్రత్యేకాధికారి రామకృష్ణ పాల్గొన్నారు. 


పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

ఎస్పీ కోటిరెడ్డి

మహబూబాబాద్‌ రూరల్‌: పర్యావరణ పరిరక్షణ బా ధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. హరితహారంలో భాగంగా ఆయన జిల్లా పోలీస్‌ కార్యాలయంలో మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. డీజీపీ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్లలో అధికారులు సిబ్బందితో కలిసి మొక్కలను నాటాలన్నారు. మొక్కలు నాటి సంరక్షించడం ద్వారా సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ ప్రభాకర్‌, టౌన్‌ డీఎస్పీ నరేశ్‌కుమార్‌, ఏఆర్‌ డీఎస్పీ జనార్దన్‌రెడ్డి, ఆర్‌ఐలు నర్సయ్య, పూర్ణ చందర్‌, సురేశ్‌లాల్‌ బాబు తదితరులు పాల్గొన్నారు. 

చెట్లతోనే మానవ మనుగడ 

చెట్లతోనే మానవ మనుగడ సాధ్యమని రెడ్యాల గ్రామ సర్పంచ్‌ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. హరితహారంలో భాగంగా మంగళవారం ఆయన గ్రామంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో మొక్కలను నాటారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హరితహారం కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నా రు. కార్యక్రమంలో మహబూబాబాద్‌ రూరల్‌ ఎస్సై రమేశ్‌బా బు, హెచ్‌ఎం లింగయ్య, ఉపాధ్యాయులు మోహన్‌ నాయ క్‌, రమేశ్‌, కిషన్‌ తదితరులు పాల్గొన్నారు. 


హరితహారం అందరి కార్యక్రమం

కురవి : హరితహారం అందరి కార్యక్రమమని బలపాల లింగ్యాతండా సర్పంచ్‌ గుగులోత్‌ రాంలాల్‌నాయక్‌ అ న్నారు. మంగళవారం ఆయన లింగ్యాతండాలో వెయ్యి టేకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు బానోత్‌ వీరన్న, మాలోత్‌ వీరన్న, ఉపసర్పంచ్‌ దేవేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

పబ్లిక్‌పార్కు పనులకు శంకుస్థాపన

గూడూరు :మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో పబ్లిక్‌పార్కు పనులకు ఎఫ్‌డీవో వెంకన్న మంగళవారం శంకుస్థాపన చేశారు. పార్కులో వివిధ రకాల ఔషధ మొక్కలతో పాటు వాకింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఆర్‌వో అమృత, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, సర్పంచ్‌ యాకయ్య, సురేందర్‌ పాల్గొన్నారు. 

కనీసం ఐదు మొక్కలు నాటాలి

గార్ల: ప్రతి ఒక్కరూ కనీసం ఐదు మొక్కలు నాటి వాటి ని పరిరక్షించాలని చిన్న కిష్టాపురం సర్పంచ్‌ గంగావత్‌ రుక్మిణి  పిలుపునిచ్చారు. హరితహారంలో భాగంగా మంగళవారం చిన్న కిష్టాపురం పంచాయతీలోని దేశ్యతండాలో ఎస్సై శ్రీనివాసరెడ్డి, యవతీ యువకులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ.. విరివిగా మొక్కలు నాటి తెలంగాణను ఆకుపచ్చ తెలంగాణగా మార్చాలన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ కోరం కళ, కార్యదర్శి సరిత, అశోక్‌నాయక్‌, అనిల్‌, సంతోష్‌ జేతు రాం, నాగేందర్‌ తదితరులు పాల్గొన్నారు.logo