ఆదివారం 05 జూలై 2020
Mahabubabad - Jul 01, 2020 , 02:48:07

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

డోర్నకల్‌ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌

డోర్నకల్‌ : ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించే బాధ్యతలు తీసుకోవాలని ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన మున్సిపాలిటీ పరిధిలో 6, 10,12,13,14 వార్డుల్లో మొక్కలు నాటారు. 14వ వార్డులో ఆటోలో మైక్‌ ద్వారా హరితహారంపై వినూత్న ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. పల్లెలు, పట్టణాలను హరితవనాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ హరితహారాన్ని అమలు చేస్తున్నారన్నారు. ప్రతి ఇంట్లో ఆరు పండ్ల మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యతలను కుటుంబ సభ్యులందరూ తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీలో వార్డుల వారీగా ఇచ్చిన టార్గెట్లను కౌన్సిలర్లు పూర్తి చేయాలన్నారు. జిల్లాలోని ఆరో విడుత హరితహారాన్ని విజయవంతం చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులను ఆయన కోరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు నున్నా రమణ, మున్సిపల్‌ చైర్మన్‌ వీరన్న, వైస్‌ చైర్మన్‌ కోటిలింగం, జెడ్పీటీసీ కమలరామనాథం,  కమిషనర్‌ మల్లికార్జునస్వామి, తహసీల్దార్‌ శ్రీకాంత్‌, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, పీఏసీఎస్‌ చైర్మన్‌ భిక్షంరెడ్డి, టీఆర్‌ఎస్‌ టౌన్‌ కార్యదర్శి విద్యాసాగర్‌, కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.


logo