ఆదివారం 05 జూలై 2020
Mahabubabad - Jul 01, 2020 , 02:45:01

పల్లె ప్రకృతి వనాన్ని ఆదర్శంగా నిలుపాలి

పల్లె ప్రకృతి వనాన్ని ఆదర్శంగా నిలుపాలి

      త్వరగా పనులు పూర్తి చేయాలి

వావిలాలలో కలెక్టర్‌ వీపీ గౌతమ్‌

పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం

నెల్లికుదురు : మండల కేంద్రంలోని పల్లె ప్రకృతి వనం(పార్కు) జిల్లాకు ఆదర్శంగా నిలువాలని, పార్కు నిర్మాణ పనులను నాలుగో తేదీ వరకు పూర్తి చేయాలని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ అధికారులు, సర్పంచ్‌ యాదగిరిరెడ్డిని ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టర్‌ మండలంలోని వావిలాల గ్రామంలో అవెన్యూ ప్లాంటేషన్‌, నర్సరీని పరిశీలించారు. నర్సరీలో టేకు మొక్కలు మాత్రమే ఉండడం, అవెన్యూ ప్లాంటేషన్‌ తగిన మొక్కలు లేకపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతగా వ్యవహరించాలని నర్సరీ నిర్వాహకులను మందలించారు. అనంతరం గ్రామంలోని సర్వే నంబర్‌ 371లో ప్రభుత్వ భూమిని, నెల్లికుదురులో మోడల్‌ స్కూల్‌ పక్కన సర్వే నంబర్‌ 682, 598లో నిర్వహిస్తున్న పల్లె ప్రకృతి వనం నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. అవె న్యూ ప్లాంటేషన్‌కు ఒకటిన్నర మీటరు ఎత్తు ఉన్న మొ క్కలను మాత్రమే నాటాలన్నారు. ఎత్తుగా ఉన్న మొక్క లు నాటితే తొందరగా నాటుకుని ఎదుగుతాయని చెప్పారు. నెల్లికుదురులో ప్రకృతి వనం నిర్మాణ పనులు వేగవంతంగా జరగడంపై సర్పంచ్‌ని అభినందించారు. ఈ నెల 3 వరకు పనులు పూర్తయి 4న ప్రారంభించి జిల్లాకు ఆదర్శంగా నిలువాలన్నారు. అనంతరం తహసీల్‌ కార్యాలయంలో కార్యాలయ నిర్వాహణ రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టు డైరెక్టర్‌ విద్యాచందన, ఎంపీటీసీ వాణి, వావిలాల సర్పంచ్‌ శ్రీనివాస్‌, తహసీల్దార్‌ రమేశ్‌, ఎంపీడీవో వేణుగోపాల్‌రెడ్డి, ఎంపీవో పార్థసారథి తదిరులు పాల్గొన్నారు. logo