సోమవారం 13 జూలై 2020
Mahabubabad - May 31, 2020 , 03:37:10

నియంత్రిత సాగుతో రైతులకు మేలు

నియంత్రిత సాగుతో రైతులకు మేలు

  • చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌

వరంగల్‌ క్రైం/నయీంనగర్‌: నియంత్రిత పంటల సాగు ద్వా రా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. 49వ డివిజన్‌ కృషిభవన్‌లో నియంత్రిత పంటల సాగు విధానంపై శనివారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. చీఫ్‌ విప్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. లాభదాయక పంటల సాగుతో దిగుబడుల కు డిమాండ్‌ వచ్చి రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అ న్నారు. ప్రభు త్వం నిర్ణయించిన మేరకు పంటలు సాగు చేస్తే ప్ర భుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు. దేశానికే తెలంగాణ అ న్నపూర్ణగా నిలిచిందని, కాళేశ్వరంతోపాటు అనేక ప్రాజెక్టుల ని ర్మాణం, 24 గంటలు నాణ్యమైన కరంట్‌తో రాష్ట్రంలో వ్యవసా యం పండుగలా మారిందని అన్నారు. కార్యక్రమంలో కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, కార్పొరేటర్‌ స్వప్న, వ్యవసాయశాఖ జేడీఏ ఉషా దయాళ్‌, ఏవో శ్రీలత, రైతుబంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్‌ లలితాయాదవ్‌, టీఆర్‌ఎస్‌ డివిజన్‌ అధ్యక్షుడు చెన్నం మ ధు, నాయకులు రెడ్డి రాజేశ్వర్‌, మడిపెల్లి సుమన్‌గౌడ్‌, అజ య్‌, రాజేశ్‌, అరీఫ్‌, ప్రభాకర్‌, మాడిశెట్టి శివశంకర్‌ పాల్గొన్నారు. 

నిత్యావసర సరుకుల పంపిణీ.. 

చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ ఆధ్వర్యంలో శనివారం 40వ డివిజన్‌ లష్కర్‌ బజార్‌లోని మర్కజీ పాఠశాలలో 200 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకుల ను పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ భౌతికదూరం పాటిం చాలని, విధిగా మాస్క్‌ ధరించాలని ఆయన సూచించారు.


logo