సోమవారం 13 జూలై 2020
Mahabubabad - May 31, 2020 , 03:28:30

కొత్తగా వచ్చేవారి సమాచారాన్ని తెలియజేయాలి

కొత్తగా వచ్చేవారి సమాచారాన్ని తెలియజేయాలి

చిన్నగూడూరు: ఇతర ప్రాంతాల నుంచి కొత్తగా వచ్చేవారి సమాచారాన్ని అధికారులకు తెలియజేయాలని తాహసీల్దార్‌ అనురాధాబాయి తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో హోం క్వారంటైన్‌లో ఉన్న పలువురికి మండల రెస్క్యూటీం ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. మండలంలోని ఆయా గ్రామాలకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 61మందిని హోంక్వారంటైన్‌లో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.


logo