లండన్, మార్చి 30: ప్రపంచ సెక్సీయెస్ట్ బాల్డ్ మ్యాన్ టైటిల్… ‘డ్యూక్ ఆఫ్ కేంబ్రిడ్జి’ ప్రిన్స్ విలియంను వరించింది. ఆయనతో పోటీ పడిన వారిలో డావెన్ జాన్సన్ అలియాస్ ది రాక్ కూడా ఉన్నారు. కాస్మొటిక్ సర్జరీ నిపుణులు నిర్వహించిన సర్వే ఆధారంగా ప్రపంచంలో బట్టతల కలిగిన పురుషుల్లో అత్యంత అందగాడిగా విలియంను బ్రిటిష్ వార్తాపత్రిక ‘ది సన్’ ప్రకటించింది. బ్లాగులు, కథనాలు, నివేదికల్లో విలియంను ‘సెక్సీ’ అని కోటీ 76 లక్షల సార్లు నెటిజన్లు సంబోధించారని పేర్కొంది. విలియం ఎంపికపై రాక్ మండిపడ్డారు. రీకౌంటింగ్ కోసం డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి:
ఆసియన్-అమెరికన్ వృద్ధురాలిపై
హాంకాంగ్‌పై చైనా మళ్లీ కన్నెర్ర..
అధ్యక్షుడి చివరి చూపు కోసం వచ్చి 45 మంది మృతి