బుధవారం 03 జూన్ 2020
Mahabubabad - Mar 22, 2020 , 03:28:26

జనతా కర్ఫ్యూలో స్వచ్ఛందంగా పాల్గొనాలి

జనతా కర్ఫ్యూలో స్వచ్ఛందంగా పాల్గొనాలి

  • కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ 
  • అన్నిరకాల రక్షణ చర్యలను తీసుకుంటున్నాం
  • ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి

మహబూబాబాద్‌ రూరల్‌ : జనతా కర్ఫ్యూలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు కర్ఫ్యూను ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పట్టణంలో ఉన్న షాపింగ్‌మాళ్లు, హోటళ్లు, అన్ని రకాల దుకాణ యజమానుదారులకు ముందస్తుగా సమాచారం అందించామన్నారు. జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే కరోనా వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, అందుకే కర్ఫ్యూను పాటించి వైరస్‌ను నివారించాలన్నారు. జిల్లాకు ఆస్ట్రేలియా, లండన్‌, దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 60 మంది యువకులను రెవెన్యూ సిబ్బంది, పోలీస్‌ సిబ్బంది గుర్తించారని, వారికి తమ నివాసంలోనే 14 రోజులపాటు ఉండేలా కౌన్సెలింగ్‌ నిర్వహించామన్నారు. అనంతరం ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి మాట్లాడుతూ.. ఈ జనతా కర్ఫ్యూకు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో పూర్తిస్థాయి రక్షణ చర్యలను తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌వో ధనసరి శ్రీరాం, డాక్టర్‌ రాజేశ్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ఇంట్లో నుంచే ఐసోలేషన్‌ తీసుకోవాలి

మహబూబాబాద్‌ టౌన్‌ : విదేశాల నుంచి ఇటీవల జిల్లాకు వచ్చినవారు ఇంట్లో నుంచే ఐసోలేషన్‌ తీసుకోవాలని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ సూచించారు. శనివారం నెహ్రూసెంటర్‌లో కలెక్టర్‌ గౌతమ్‌, ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి స్థానికులకు కరోనా వైరస్‌పై అవగాహన కల్పించారు. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి 14 రోజులు నిర్బంధంలో ఉండి మాస్కులు ధరించాలన్నారు. చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలన్నారు. రోగి శ్వాస సంబంధిత ద్రవాలు, విసర్జక ద్రవాలు తొలగించేటప్పుడు డిస్పోజబుల్‌ గ్లౌజులను ఉపయోగించాలన్నారు. ఇంట్లో ఎవరైనా వ్యక్తులకు జ్వరం, దగ్గు, శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు ఏర్పడితే 108 వాహనానికి కాల్‌ చేసి దవాఖానకు వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ ఇంద్రసేనారెడ్డి, తహసీల్దార్‌ రంజిత్‌కుమార్‌, ఏఎన్‌ఎంలు ప్రజలు ఉన్నారు. 

ప్రభుత్వ దవాఖానలో కలెక్టర్‌ తనిఖీలు

జిల్లా కేంద్రంలోని ఏరియా దవాఖానలో కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దవాఖానలో మరమ్మతులు జరుగుతున్న కరోనా ఐసోలేషన్‌ వార్డును పరిశీలించారు. త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. తాత్కాలిక ఐసోలేషన్‌ వార్డులో తీసుకుంటున్న జాగ్రత్తలను, వసతులను ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ భీంసాగర్‌ను అడిగి తెలుసుకున్నారు. 

గూడూరులో 10 పడకల ఐసీయూ ఏర్పాటుకు ఆదేశం

గూడూరు : గూడూరు సీహెచ్‌సీకి 10 పడకల ఐసీయూను ఏ ర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ గౌతమ్‌ అధికారుల ను ఆదేశించారు. శనివారం మండల కేంద్రంలోని సీహెచ్‌సీని తనిఖీ చేసి దవాఖానలో ఉన్న గదులను కలెక్టర్‌ పరిశీలించారు. అక్కడే ఉ న్న వైద్యాధికారి భీంసాగర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కరోనా నివారణకు తీసుకుంటున్న జాగ్రత్తలు తెలుసుకుని ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించా రు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో నూతనంగా ఎంపికైన అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు అవగాహన కల్పించారు. అక్కడి నుంచి గతవారం బెహరాన్‌ నుంచి వచ్చిన వ్యక్తి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకున్నారు. తహసీల్దార్‌ చంద్రశేఖర్‌, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్‌ రాజకట్టయ్య పాల్గొన్నారు. 


logo