బుధవారం 03 జూన్ 2020
Mahabubabad - Mar 09, 2020 , 03:34:47

మురిసిన నారీమణులు

మురిసిన నారీమణులు

మహబూబాబాద్‌, నమస్తే తెలంగాణ, మార్చి 8: ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా నారీ మణుల మోముల్లో ఆనందం వెల్లివిరిసింది. ఆదివారం అంతార్జాతీయ దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ప్రత్యేకంగా కార్యక్రమాలను నిర్వహించి అన్నింట్లో సగభాగమైన మహిళలు మగవారికి తీసిపోనిరీతిలో అన్ని రం గాల్లో రాణిస్తున్నారని మహిళామణుల సేవలను కీర్తించారు. ఇందులో భాగంగా వివిధ మహిళా, స్వచ్ఛం ద, టీచర్స్‌ సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక సదస్సులు, సమావేశాలు నిర్వహించి మహిళలను సన్మానించారు.  

పీఆర్టీయూ టీఎస్‌ ఆధ్వర్యంలో స్థానిక కంకరబోడు పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దితోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మార్షల్‌ ఆర్ట్స్‌ ట్రైనర్‌ క్రాంతి ఆధ్వర్యంలో ఆత్మ రక్షణ నైపుణ్యాలను మహిళలకు నేర్పించారు. కార్యక్రమానికి పీఆర్టీయూ టీఎస్‌ మహబూబాబాద్‌ మండల అధ్యక్షురాలు బీ గీత అధ్యక్షత వహించగా జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆంగోంతు బిందు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలను నిరోధించే విధంగా ప్రత్యేక చట్టాలు రూపొందించాలని అన్నారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సంకా బద్రీనారాయణ మాట్లాడుతూ సమసమాజ నిర్మాణంలో మహిళలు ముందుండాలని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ప్రియాంక, ఎంపీపీ మౌనిక, మున్సిపల్‌ కౌన్సిలర్లు యాళ్ల పుష్పలత, మార్నేని శ్రీదేవి, గోగుల అనురాధ, కర్పూరపు పద్మ, గుండా స్వప్న, దౌలాగర్‌ స్వాతి, నీరజ, గద్దె నీరజ, షేక్‌ ఫరీదా, ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.

 జిల్లా ఫొటో అండ్‌ వీడియో గ్రాఫర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సన్మానం

మానుకోట జిల్లా ఫొటో అండ్‌ వీడియో గ్రాఫర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆంగో తు బిందును  ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆంగోతు బిందు మాట్లాడుతూ ఇటీవల మహిళలపై దాడులు, హత్యలు చోటుచేసుకుంటున్నాయని, మహిళలు ధైర్యంగా ముందుకు సాగాలన్నారు.  కార్యక్రమంలో నీలం కృష్ణవేణి, గంగుల సంధ్య, పల్లె రాణి, మమత, షాహిన్‌, సంధ్య, అసోసియేషన్‌ అధ్యక్షుడు నీలం రమేశ్‌, ప్రధాన కార్యదర్శి బొమ్మోజు వెంకన్నచారి, కోశాధికారి గంగుల గిరి, ఉపాధ్యక్షుడు సందీప్‌, శ్రీధర్‌, పల్లె శ్రీనివాస్‌, శివరాజ్‌, నాగరాజు, ఉపేందర్‌, వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు.

మహిళల అభివృద్ధితోనే దేశ ప్రగతి 

బయ్యారం  : మహిళల అభివృద్ధితోనే ప్రగతి  సాధ్యమవుతుందని జెడ్పీచైర్మన్‌ అంగోత్‌ బిందు అన్నా రు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్రీన్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బయ్యారం జీపీ కార్యాలయంలో సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా అభివృద్ధ్ది చెందాలని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కోటమ్మ, ఉపసర్పంచ్‌ కవిత, ఎంపీటీసీ శైలజరెడ్డి, కుమారి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు వెంకన్న పాల్గొన్నారు. 


logo