శుక్రవారం 05 జూన్ 2020
Mahabubabad - Mar 09, 2020 , 03:22:45

‘మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి’

‘మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి’

మరిపెడ నమస్తేతెలంగాణ: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనేది సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష అని మరిపెడ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుగులోతు సింధూరకుమారి అన్నారు. ఆదివారం మరిపెడ ము న్సిపల్‌ ఆఫీస్‌లో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పా టు చేయగా చైర్‌పర్సన్‌ సింధూర ప్రారంభించారు. అనంతరం ఆమె ను స్థానిక మహిళా వార్డు కౌన్సిలర్లు సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీ ఎం కేసీఆర్‌ మహిళల ఆర్థికాభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు.  పీహెచ్‌సీ డా క్టర్‌ రవినాయక్‌ మహిళలకు వైద్యపరీక్షలు జరిపి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ మహిళా వైద్య సిబ్బంది, ఆశ వర్కర్లను సన్మానించారు. కార్యక్రమంలో కమిషనర్‌ రాజేశ్వర్‌, మున్సిపల్‌ సిబ్బంది, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.logo