శుక్రవారం 05 జూన్ 2020
Mahabubabad - Mar 06, 2020 , 03:05:34

మురిసిన పట్నం

మురిసిన పట్నం

మహబూబాబాద్‌, నమస్తే తెలంగాణ, మార్చి 05 : పట్టణ ప్రగతి సక్సెస్‌ అయింది. మున్సిపాలిటీల్లో 10రోజుల పాటు జరిగిన పనులపై పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకు సాగారు. వార్డు కమిటీలకు తోడుగా ప్రజలంతా స్వచ్ఛందంగా పట్టణ ప్రగతిలో పాల్గొన్నారు. దీంతో గత 10రోజుల్లో వార్డుల్లో చాలా మార్పులు వచ్చాయి. చెత్త,చెదారం, ముళ్లకంచెలు, పిచ్చి మొక్కలు లేకుండాపోయాయి. వార్డుల్లో పారిశుధ్య పనులతో పాటు విద్యుత్‌ పనులను మెరుగుపర్చడం, పచ్చదనాన్ని పెంపొందించేందుకు కాలనీల్లో మొక్కలు నాటారు. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లోని 82 వార్డుల్లో 10 రోజుల పాటు పట్టణ ప్రగతి కార్యక్రమం జోరుగా నిర్వహించారు.  పా డుబడిన ఇళ్లను కూల్చివేశారు. నిరూపయోగంగా ఉన్న బావులను గుర్తించి వాటిని పూడ్చారు. జిల్లాలో మహబూబాబాద్‌, తొర్రూ రు, మరిపెడ, డోర్నకల్‌ పట్టణాల్లో పది రోజుల్లో పెను మార్పులు వచ్చేలా పనులు చేశారు.  


మహబూబాబాద్‌ మున్సిపాలిటీలో.. 

మహబూబాబాద్‌ మున్సిపాలిటీలో మొత్తం 36వార్డుల్లో పదిరోజుల పాటు పట్టణ ప్రగతి కా ర్యక్రమం కొనసాగింది. 36వారుల్లో 849 ప్రధా న సమస్యలను గుర్తించి పదిరోజుల్లో 462 సమస్యలను తక్షణమే పరిష్కరించారు. అందులో భాగంగా 686 ఖాళీ ప్లాట్లను గుర్తించి, 377 ప్లాట్లలో చెత్త లేకుండా క్లీన్‌ చేశారు. 36 వార్డుల్లో 178పాడుబడిన ఇళ్లను గుర్తించి, 71ఇళ్లను కూలగొట్టారు. మున్సిపాలిటీ పరిధిలో 135 విద్యుత్‌ స్తంభాలు పాడైనట్లుగా గుర్తించారు. ఇప్పటి వరకు కొత్తగా7 విద్యుత్‌ స్తంభాలను వేశారు. మిగిలినవి త్వరలో ఏర్పాటు చేయనున్నారు. పట్టణంలో నిరూపయోగంగా 50బోర్లు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో 7బోర్లను పూడ్చివేశారు. పట్టణంలోని 36వార్డుల్లో 4వేల మొక్కలు నాటాలనే లక్ష్యంగా ఎంచుకోగా, 1,124 మొక్కలు నాటారు. వీటితో పాటు రోడ్లు, డ్రైనేజీలను శుభ్రం చేశారు. 


logo