ఆదివారం 07 జూన్ 2020
Mahabubabad - Mar 06, 2020 , 03:02:29

కల్యాణం. కమనీయం

కల్యాణం. కమనీయం

కురవి, మార్చి 05 : మండల కేంద్రంలోని భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం కురవి హనుమత్‌ సమేత శివాలయంలో ఆదిదంపతుల కల్యాణం నేత్రపర్వంగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ ఆద్యంతం కనులవిందుగా ఈ వేడుక సాగింది. ఆలయ ప్రధాన పూజారి పారుపెల్లి రామన్న ఆధ్వర్యంలో వేదపండితులు రవిచంద్ర, శ్రీకర్‌, పూజారులు తాటికొండ పుణ్యమూర్తి, శివ ఉదయం గణపతిపూజతో వేడకలు ప్రారంభించారు. అనంతరం పుణ్యాహవచనం, మహాన్యాస పారాయణం, రామలింగేశ్వర ఏకరుద్రాభిషేకం, అష్టోత్తర శతనామార్చన అనంతరం యజ్ఞశాలలో మహాపూర్ణాహుతిని నిర్వహించారు. వీరభద్రస్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ, టీఆర్‌ఎస్‌ నాయకులు నూతక్కి నర్సింహారావు, ఎంపీటీసీ చిన్నం భాస్కర్‌ దంపతులు, రిటైర్డ్‌ ఆలయ ఈవో నూతక్కి జగదీశ్వర్‌దంపతులు, దడిగెల రవి స్వామివారికి పట్టు వస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలను మంగళవాయిద్యాల నడుమ వీరభద్రుడి ఆలయం నుంచి శివాలయానికి తీసుకువచ్చారు. కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు హాజరయ్యారు. వారి రాకకు తగ్గట్టుగా ఇబ్బందులు కలగకుండా ఈవో సత్యనారాయణ పలు ఏర్పాట్లు చేశారు. పూజలో ధరణి ఎస్టేట్స్‌ చైర్మన్‌ భట్టు రమేశ్‌ దంపతులు, డాక్టర్‌ ఆర్‌ శ్రీనివాస్‌ దంపతులు, ఆలయ సిబ్బంది రవి, రాజశేఖర్‌,  సమ్మయ్య,  కన్నె గురుమూర్తి, బత్తిని వీరభద్రం, నిర్మల, రేణుక హాజరయ్యారు. ఈ కల్యాణ వేడుక అనంతరం వరంగల్‌కు చెందిన చిందు యక్షగానం కళాకారులు తమ నటనతో భక్తులను భక్తిపారవశ్యంలో తేల్చారు. గజవల్లి భుజంగం బృందం సమ్మయ్య, స్వామి, శ్రీశైలం, శ్రీలత పాల్గొన్నారు. 


వేడుకగా కల్యాణ తంతు..

వేదపండితులు కల్యాణ తంతును వేడుకగా, శాస్త్రోయుక్తంగా నిర్వహించారు. ఉదయం నుంచే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలను నిర్వహించా రు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఆసనంలో స్వామివారి, అమ్మవారి ఉత్సవ మూర్తుల ను ఆధిష్టించారు. పుణ్యాహవచనం, వరుణదేవుడిని ఆవహనం చేసి  శుద్ధిపూజ నిర్వహించారు. పీ ఠపూజ, యజ్ఞోపవీతం, కంకణాలకు పూజలను నిర్వహించారు. అనతంరం వీరన్న ఆలయం నుం చి తెచ్చిన పట్టు వస్ర్తాలను స్వామివారికి అలంకరించారు. కల్యాణం, మహా హారతితో ఈ వేడుక ముగిసింది. ఇంటివద్ద నుంచి తెచ్చిన తలంబ్రాలు, కట్న కానుకలను భక్తులు స్వామివారికి సమర్పించారు. కల్యాణానికి వచ్చిన ముఖ్య అతిథులకు అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు.


logo