శుక్రవారం 05 జూన్ 2020
Mahabubabad - Mar 04, 2020 , 02:14:44

నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు
  • ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు..
  • ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
  • నిమిషం ఆలస్యం నిబంధన వర్తింపు
  • కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు
  • నిమిషం ఆలస్యం నిబంధన వర్తింపు
  • పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్‌ అమలు
  • జిల్లాలో 19 పరీక్ష కేంద్రాల ఏర్పాటు

మహబూబాబాద్‌  రూరల్‌  మార్చి  03  : నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని  ఏర్పాట్లు  చేశారు. జిల్లాలో మొత్తం 11,165 మంది విద్యార్థులు ఉండగా ఫస్టియర్‌ లో 5,770, సెకండియర్‌లో 5,395 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.  

ఇంటర్‌ పరీక్షల కోసం జిల్లాలో 16 మండలాల్లో 19 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహబూబాబాద్‌, బయ్యారం, గార్ల, కొత్తగూడ, తొర్రూరు, నెల్లికుదురు, కేసముద్రం, గూడూరు, డోర్నకల్‌, పెద్దవంగర, మర్రిపెడ మండలాల్లోని ప్రభుత్వ జూనియర కళాశాలలో, మహబూబాబాద్‌ పట్టణ కేంద్రంలో శ్రీచైతన్య జూనియర్‌ కళాశాల, తొర్రూరులోని సమత జూనియర్‌ కళాశాలో సెంటర్లను ఏర్పాటు చేశారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు మంచి నీటి సదుపాయం, వైద్యసిబ్బంది, టాయిలెట్లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు.


పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌

అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసి 144 సెక్షన్‌ను అమలు చేయనున్నారు. పరీక్ష సెంటర్‌కు 100 మీట ర్ల దూరంలో వాహనాల పార్కింగ్‌ సదుపాయాలను కల్పించారు. పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్స్‌ సెంటర్లను మూసి వేసే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద నలుగురు సిట్టింగ్‌ స్కాడ్‌లు,  మూడు ఫ్లయింగ్‌ స్కాడ్‌ బృందాన్ని సిద్ధ్దం చేశారు.  


నిమిషం ఆలస్యం నిబంధన వర్తింపు.. 

 విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రం చేరుకోవాలని, ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్ష హాల్లోకి అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు.  ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. విద్యార్థ్దులకు ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచేలా ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు.


 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి.. కేవీ ఆజాద్‌, జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి

ఇంటర్‌ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. జిల్లాలో మంచి ఫలితాలను సాధించేలా విద్యార్థ్దులకు ఓరియంటేషన్‌ తరగతులను నిర్వహించాం.  పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. అందుకు అవసరమైన పోలీస్‌ సిబ్బందిని ఏర్పాటు చేశాం. logo