శుక్రవారం 05 జూన్ 2020
Mahabubabad - Feb 16, 2020 , 03:29:17

సేవా తత్పరుడు సేవాలాల్‌

సేవా తత్పరుడు సేవాలాల్‌

గిరిజనులందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి మానుకోట ఎంపీ మాలోత్‌ కవిత సంప్రదాయరీతిలో భోగ్‌బండార్‌ జిల్లా కేంద్రంలో భారీ ఉరేగింపు పాల్గొన్న జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆంగోత్‌ బిందు, ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌

మహబూబాబాద్‌ రూరల్‌, ఫిబ్రవరి 15: లంబాడీ గిరిజనుల గురువుగా, ఆరాధ్య దైవం సంత్‌ సేవాలాల్‌ సేవా తప్పరుడని మహబూబాబాద్‌ ఎంపీ మాలోత్‌ కవిత అన్నారు. శనివారం అనంతాద్రి వద్ద ఘనంగా సేవాలాల్‌ 281వ జయంతి నిర్వహించారు. తహసీల్దారు కార్యాలయం నుంచి అనంతారం సేవాలాల్‌ గుడి వరకు ఎంపీ కవిత, జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆంగోత్‌ బిందు, ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. లంబాడీ మహిళలు సంప్రదాయ నృత్యాలు చేస్తూ పట్టణంలో ర్యాలీతో ఆలయం వద్దకు చేరుకున్నారు. 


ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ.. అన్ని వర్గాల అభ్యున్నతిని కోరుకునే ముఖ్యమంత్రి బంజారహిల్స్‌లో గిరిజన భవన్‌ నిర్మించేందుకు శంకుస్థాపన చేసిన విషయం గుర్తు చేశారు. అలాగే మానుకోటలో కూడా రూ.1.11 కోట్లతో గిరిజన భవనాన్ని నిర్మించారన్నారు. గిరిజన అరాధ్యదైవమైన సేవాలాల్‌, మరియమా మాత(జగదాంబ) ఆలయాన్ని నిర్మించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సేవాలాల్‌ మహారాజ్‌ జయంతిని జరుపుకోవడం గర్వంగా ఉందన్నారు. సేవాలాల్‌ గుడి నిర్మాణం కోసం రూ. 50 లక్షల  పెట్టి భూమి కొనుగోలు చేసి ఇక్కడ కమ్యూనిటీ హాలును నిర్మిస్తున్నామన్నారు. అనంతారం దేవాలయంలో కరెంట్‌ సౌకర్యం కలిపించిన డీఈ సౌమ్యనాయక్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దేవాలయ నిర్మాణానికి ఎంపీ సీతారాంనాయక్‌, చైర్‌పర్సన్‌, నూతన సర్పంచ్‌లందరూ సహకారం అందించాలని కోరారు.


జెడ్పీ చైర్‌పర్సన్‌ అంగోత్‌ బిందు మాట్లాడు తూ... సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. జాతిని సంస్కృతిని కాపాడుకోవాలని,  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గిరిజనులకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. జ యంతి ఉత్సవాలను రూ. 1 కోటి కేటాయించ డంపై సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ మాట్లాడుతూ... దేశంలో 10 కోట్ల మంది గిరిజనులు ఉన్నారని సేవాలాల్‌ మహరాజ్‌ అనంతపురంలో దొడ్డి దగ్గర జన్మించి దేశంలోని వివిధ ప్రదేశాలు తిరుగుతూ బంజార జాతి అభివృద్ధికి కృషి చేశారన్నారు. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రం సేవాలాల్‌ ట్రస్టు ఏర్పాటు చేసి  సేవాలాల్‌ దేవాలయ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. బంజారాలకు మొదటి దేవుడు సేవాలాల్‌ అయితే రెండో దేవుడు కేసీఆర్‌నే కొలుస్తామన్నారు. 


వన్యప్రాణుల సంరక్షణ కమిటీ సభ్యుడు బానోత్‌ రవికుమార్‌ మాట్లాడుతూ.. సేవాలాల్‌ మహారాజ్‌ను ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటూ సంస్కృతి సంప్రదాయాలను విస్తరింప చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ డాక్ట ర్‌ పాల్వాయి రాంమ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే సతీమ ణి సీతామహాలక్ష్మి, జిల్లా కోఆప్షన్‌ సభ్యులు మహబూబ్‌పాషా, సేవాలాల్‌ ఉత్సవ కమిటీ నాయకులు ధరావత్‌ వెంకన్ననాయక్‌, బోడ లక్ష్మణ్‌నాయక్‌, ఎంపీపీ భూక్యా మౌనిఖ, జడ్పీటీసీ లూనావత్‌ ప్రియాంక, ధరావత్‌ భాస్కర్‌నాయక్‌, బానో త్‌ దామునాయక్‌, గుగులోత్‌ రాంచందర్‌నాయక్‌, బాలునాయక్‌, సాధువులు గులాబ్‌సింగ్‌, హతిరాం, హరిసింగ్‌, రఘు, హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo