ఆదివారం 23 ఫిబ్రవరి 2020
నేడే సహకార సమరం

నేడే సహకార సమరం

Feb 15, 2020 , 02:38:29
PRINT
నేడే సహకార సమరం

మహబూబాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో సహకార ఎన్నికల నిర్వహణకు అధికారులు స ర్వం సిద్ధం చేశారు. జిల్లాలో మొత్తం 18 ప్రాథమిక సహకార సంఘాల పరిధిలోని 23 టీసీలకు నోటిఫికేషన్‌ విడుదల కాగా ఇందులో మూడు సంఘాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. అలాగే తొమ్మిది సొసైటీల చైర్మన్‌ పదవులను టీఆర్‌ఎస్‌ దక్కించుకుంది. మిగిలిన 15 సొసైటీల పరిధిలో ని 120 టీసీలకు నేడు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అనంతరం కౌంటింగ్‌ నిర్వహించి ఫలితాలను వెల్లడించనున్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఎడమచేతి చూపుడు వేలుకు సిరా చుక్క పెట్టినందున సహకార ఎన్నికల్లో ఎడమ చేతి మధ్యన వేలుకు సిరా చుక్క అంటించనున్నారు. జిల్లాలో 114 టీసీలు ఏకగ్రీవం కాగా ఇందులో ఇప్పటికే టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థుళు 88 టీసీలు, కాంగ్రెస్‌ బలపర్చిన అభ్యర్థులు 22, ఇతరులు 04  టీసీల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. పోటీలో ఉన్న అభ్యర్థులకు సంబంధించిన ఎన్నికల గుర్తులను అధికారులు ఇప్పటికే కేటాయించారు. అలాగే బ్యాలెట్‌ పేపర్లను ముద్రించి శుక్రవారం ఉదయం బ్యాలెట్‌ బాక్సులు, బ్యాలె ట్‌ పత్రాలతో పాటు ఎన్నికల సామగ్రిని సిబ్బందికి పంపిణీ చేశారు. వాటిని  స్వీకరించిన సిబ్బంది పోలింగ్‌ కేంద్రాలకు తరలివెళ్లారు. శనివారం ఉదయం 15 సహకార సంఘాల పరిధి 120 టీసీలకు నిర్వహించే ఎన్నికల్లో 35,034 మం ది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటిం గ్‌  ప్రక్రియ కొనసాగనుంది. అనంతరం ఓట్ల లెక్కింపు తరువాత ఫలితాలను వెల్లడిస్తారు. ఈ నెల 16న చైర్మన్‌, వైస్‌ చైర్మన్లను ఎన్నుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు.  

భారీగా పోలీస్‌ బందోబస్తు..

జిల్లాలో 18 పీఏసీఎస్‌లకు ఎన్నికలు నిర్వహించేందుకు ఈ నెల 3న నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఇందులో మూడు సొసైటీలు ఏకగ్రీవమయ్యాయి. అలాగే నామినేషన్ల స్వీకర ణ చివరి రోజు వరకు మొత్తం 114 టీసీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 120 టీసీలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా 301 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.  నలుగురు డీస్పీలు, 15 మంది సీఐలు, 20 మంది ఎస్సైలు, 161 మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తించనున్నారు. అదే విధంగా సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలుగా గుర్తించిన మహబూబాబాద్‌, బయ్యారం, గార్ల సొసైటీల వద్ద అదన పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ఇప్పటికే పోలీసులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.  

ఎడమ చేతి మధ్య వేలుకు సిరా చుక్క

ఇటీవల జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటర్లకు అధికారులు ఎడమచేతి చూపుడు వేలుకు సిరా చుక్క అంటించారు. దీంతో జిల్లాలో శనివారం నిర్వహించే సహకార ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్లకు ఎడమ చేతి మధ్యన వేలుకు సిరా చుక్క అంటించే విధంగా ఏర్పాట్లు చేశారు. 

ఎన్నికల సామగ్రి పంపిణీ

జిల్లాలో 15 సొసైటీల్లో 120 టీసీలకు నిర్వహించే సహకార ఎన్నికలకు సంబంధించిన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సిబ్బందికి సామగ్రి పంపిణీ చేశారు. వీరందరూ తమకు కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు తరలివెళ్లారు. నేడు ఉదయం 7 గంటలకే ప్రారంభమవుతున్నందున ఇప్పటికే అధికారులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. 


logo