శుక్రవారం 05 జూన్ 2020
Mahabubabad - Feb 08, 2020 , 03:09:21

ఎత్తు బంగారం ... జంతు బలులు

ఎత్తు బంగారం ... జంతు బలులు

చిలుపూర్‌, ఫిబ్రవరి 07 : మండలంలోని పలు గ్రామాల్లో సమ్మక్క-సారలమ్మ దేవతలను భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తల్లీ, కూతుళ్లు వనం నుంచి గద్దెలకు రావడంతో వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. మండల పరిధిలోని సమ్మక్క - సారలమ్మ జాతరను జెడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి దర్శించుకుని ఎత్తు బంగారం సమర్పించి  మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే పండుగలకు వైభవం వచ్చిందన్నారు. అదేవిధంగా లింగంపల్లితో పాటు శ్రీపతిపల్లి, ఫత్తేపూర్‌ గ్రామాల్లో నిర్వహించిన జాతరల్లోనూ భక్తులు భారీగా తరలివచ్చారు.  కార్యక్రమంలో జాతర కమిటీ చైర్మన్‌ మోతె శ్రీనివాస్‌, ఈవో శేషుభారతి, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు మామిడాల లింగారెడ్డి, రైతు సేవాసమితి మండల కో ఆర్డినేటర్‌ జనగామ యాదగిరి, ఎంపీటీసీ కంకటి రవీందర్‌, నియోజక వర్గ టీఆర్‌ఎస్‌ సమన్వయ సమితి  కన్వీనర్‌ ఇల్లందుల సుదర్శన్‌, గజ్జెల దామోదర్‌, మాజీ ఎంపీటీసీ తాళ్లపెల్లి సంపత్‌, బత్తుల రాజన్‌బాబు, రచ్చ రవీందర్‌, కొండ కనుకయ్య, సత్తయ్య పాల్గొన్నారు. logo