శుక్రవారం 05 జూన్ 2020
Mahabubabad - Jan 23, 2020 , 02:13:18

పోటెత్తిన ఓటర్లు

పోటెత్తిన ఓటర్లు


మహబూబాబాద్ నమస్తే తెలంగాణ/ మహబూబా బాద్ రూరల్, జనవరి 22 : మహబూబాబాద్ మున్సిపాలి టీ పరిధిలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మున్సి పాలిటీ పరిధిలోని ఓటర్లు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేశారు. మున్సిపల్ ఎన్నికలలో ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటును వినియోగించుకున్నారు.13 వార్డులో కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి 11వ వార్డులో, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత 22వ వార్డులో తన ఓటు హక్కును తన స్నేహితురాలు హరితతో కలిసి వినియోగించుకున్నారు. 3వ వార్డులో ఎమ్మెల్యే బానోత్ శంకర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్ళపల్లి రవీందర్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సుదూర ప్రాంతాల్లో ఉన్న తమ బంధువులకు ముందుస్తుగానే సమాచారం అందించి ఓటు హక్కు వినియోగించుకునేలా చైతన్యం కల్పించారు. పోలింగ్ కేంద్రానికి కొద్ది దూరంలో ఓటర్లను ఆకర్షించుకునేలా వివిధ రాజకీయ పార్టీలు తమ గుర్తులను చూపిస్తూ ఓటు వేయాలని వేడుకున్నారు. ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి ప్రతి పోలింగ్ బూత్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో టీఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటా పోటీ గా తమ ఓటుహకుక వినియోగించుకున్నారు. 8వ వార్డులో స్వతంత్ర అభ్యర్థికి, టీఆర్ అభ్యర్థికి స్వల్ప ఘర్షణ కాగా పోలీసులకు సమాచారం అందడంతో వారు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి పట్టణంలో జరుగుతున్న మున్సిపాలిటీ ఎన్నికలను ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ పోలీస్ సిబ్బందిని అలర్ట్ చేశారు. సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి వివిధ పోలింగ్ బూత్ వెళ్లి పోలింగ్ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఉత్కంఠ భరితంగా పోలింగ్

మున్సిపల్ ఎన్నికల్లో మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు, 19వ వార్డు, 20, 24, 29 వార్డుల్లో రాజకీయ అనుభవం ఉన్న నాయకులు బరిలో ఉండడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్ బూత్ ఉత్కంఠ భరితంగా పోలింగ్ కొనసాగింది. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 78.01 శాతం పోలింగ్ నమోదైంది.


logo