e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, August 2, 2021
Home జిల్లాలు నాటిన ప్రతి మొక్కనూ రక్షించాలి

నాటిన ప్రతి మొక్కనూ రక్షించాలి

నాటిన ప్రతి మొక్కనూ రక్షించాలి

కలెక్టర్‌ వీపీ గౌతమ్‌
పలు గ్రామాల్లో పర్యటన
అనుమతిలేని వెంచర్లపై చర్యలకు ఆదేశం
బాధ్యతగా పనిచేయాలని సిబ్బందికి హితవు

తొర్రూరు, జులై 16 : నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ అన్నారు. ఫ్రైడే డ్రైడే సందర్భంగా తొర్రూరు మున్సిపాలిటీతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. మడిపల్లి శివారు సోమారపుకుంట తండా, మడిపల్లి, తొర్రూరు పట్టణంలో, ఫత్తేపురం పరిధిలోని పలు ప్రధాన రోడ్లకు ఇరువైపులా ఉన్న అవెన్యూ ప్లాంటేషన్‌ను పరిశీలిం చారు. దుబ్బతండా సమీపంలోని గ్యాస్‌ ఆఫీస్‌ ఎదురుగా నిత్యం ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలుసుకున్న ఆయన అందుకు గల కారణాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. మెగా పట్టణ ప్రకృతి వనం పనులు పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. మాటేడులో ఉన్న వెంచర్‌ను పరిశీలించి డెవలపర్స్‌ నుంచి గ్రీన్‌ల్యాండ్‌ స్థలం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో రమేశ్‌, ఎంపీపీ తుర్పాటి చిన్న అంజయ్య, జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్‌, మున్సిపల్‌ చైర్మన్‌ మంగళపల్లి రామచంద్రయ్య, కమిషనర్‌ గుండె బాబు, తహసీల్దార్‌ వేంరెడ్డి రాఘవరెడ్డి, ఏపీవో పార్ధసారథి, మిషన్‌ భగీరథ ఏఈ నిశాంక్‌, ఆర్‌అండ్‌బీ డీఈ, ఎఫ్‌ఎస్‌వో ప్రత్యేకాధికారి రవీందర్‌, వైస్‌ ఎంపీపీ ఇట్టే శ్యాం సుంందర్‌రెడ్డి, ఎంపీవో గౌస్‌, సర్పంచ్‌లు యాకమ్మ, అంజలి, సోమనర్స మ్మ, కౌన్సిలర్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
రోడ్ల వెంట మొక్కలు నాటాలి
నెల్లికుదురు : రోడ్డుకు ఇరువైపులా పెద్దపెద్ద మొక్కలు నాటాలని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ సూచించారు. ఆలేరు నుంచి నెల్లికుదురు వరకు ఉన్న అవె న్యూ ప్లాంటేషన్‌ను ఆయన పరిశీలించారు. ప్రతి గ్రామం లో ఎన్ని మొక్కలు నాటారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. నాటిన ప్రతి మొక్క బతికేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎర్రబెల్లి మాధవీ నవీన్‌ రావు, మండల ప్రత్యేకాధికారి బాలరాజు, తహసీల్దార్‌ సయ్యద్‌ రఫియుద్దీన్‌, ఎంపీడీవో బీ బి.వేణుగోపాల్‌రెడ్డి, నెల్లికుదురు సర్పంచ్‌ బీరవెళ్లి యాదగిరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
స్టేజీతండాలో కలెక్టర్‌ పర్యటన
మరిపెడ : మండలంలోని స్టేజీతండాలో కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ ఆకస్మికంగా పర్యటించారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటించాలని, నాటిన మొక్కలను సంరక్షించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎస్సారెస్పీ కాల్వలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సింగారపు కుమార్‌, ఎంపీవో పూర్ణచందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మొక్కలు నాటి గ్రామాలను అందంగా తీర్చిదిద్దాలి
నర్సింహులపేట : గ్రామాల్లో మొక్కలు నాటి అందంగా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ అన్నారు. మండలంలోని పడమటిగూడెం జాతీయ రహదారి సమీపంలో ఆయన మొక్క నాటారు. అనంతరం జగ్గుతండా పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించారు. వనం విస్తీర్ణాన్ని మరింత పెంచేందుకు స్థలాన్ని సేకరించాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ టేకుల సుశీల, సర్పంచ్‌లు జొన్నగడ్డ యాదలక్ష్మి, హోలీ, లక్ష్మి, ఎంపీటీసీలు మధు, నాయకి, నాయకులు వంశి, లింగన్న, లింగ్యా పాల్గొన్నారు.
దంతాలపల్లిలో మొక్క నాటి..
దంతాలపల్లి : హరితహారంలో నాటిన ప్రతి మొక్కనూ రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్‌ గౌతమ్‌ అన్నారు. వరంగల్‌-ఖమ్మం హైవే సమీపంలో ఆయన మొక్క నాటారు. అక్కడి నుంచి గ్రామంలోని పలువురి ఇళ్లకు వెళ్లి బోదకాల నివారణ మందు వేసుకున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఆబిద్‌ అలీ, ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి, డీఎంహెచ్‌వో హరీశ్‌రాజ్‌, మండల ప్రత్యేకధికారి సబిత, డాక్టర్లు సతీశ్‌కుమా ర్‌, పవన్‌, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్‌ వలా ద్రి మల్లారెడ్డి, సర్పంచ్‌ దర్శనాల సుష్మిత, ఎంపీటీసీ యాక న్న, అధికారులు, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నాటిన ప్రతి మొక్కనూ రక్షించాలి
నాటిన ప్రతి మొక్కనూ రక్షించాలి
నాటిన ప్రతి మొక్కనూ రక్షించాలి

ట్రెండింగ్‌

Advertisement