‘బతుకమ్మ’ కథల పోటీ


Mon,July 8, 2019 12:45 AM

తెలంగాణ సాధనే ఊపిరిగా ఉద్భవించిన నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం సంయుక్త నిర్వహణలో కథల పోటీని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, చరిత్ర, సమకాలీన జీవన వైవిధ్యాల నేపథ్యంగా నవ్యత, సృజనాత్మకతకు అద్దంపట్టే కథలను పోటీకి ఆహ్వానిస్తున్నట్లు వారు తెలిపారు. పోటీకి వచ్చిన కథల్లో మొత్తం 22 కథలను ఎంపిక చేసి లక్షా అరువై వేల విలువ చేసే బహుమతులు అందజేయనున్నట్లు వారు తెలిపారు. ప్రథమ బహుమతి (ఒక్కరికి) రూ.50 వేలు, 2 ద్వితీయ బహుమతులు (ఒక్కక్కరికి రూ.25 వేలు, 3 తృతీయ బహమతులు (ఒక్కొక్కరికి) రూ.10 వేలు, 6 కన్సోలేషన్ బహుమతులు (ఒక్కొక్కరికి) రూ.5 వేలు ఇవ్వనున్నట్లు వారు తెలిపారు. గతంలో ఎక్కడా ప్రచురితం కానీ, పరిశీలనలో లేని కథలను పోటీకి స్వీకరించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సరైన హామీ పత్రం జతచేసి జూలై 20వ తేదీలోగా అందేటట్లు కథలు పంపాలి. కథలను బతుకమ్మ కథల పోటీ, నమస్తే తెలంగాణ, 8-2-603/1/7,8,9 రోడ్ నెంబర్ 10, బంజారాహిల్స్, హైదరాబాద్-500034 అనే చిరునామాకు పంపాలి. విజేతలకు ముల్కనూర్‌లో జరిగే సభలో బహుమతులు ప్రదానం చేస్తారు.
- బతుకమ్మ (నమస్తే తెలంగాణ)
- ముల్కనూరు ప్రజా గ్రంథాలయం

84
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles