నిరతము వెలిగే రవి


Mon,July 22, 2019 12:20 AM

Dasaradhi
విప్లవజ్వాలలు గుండెల రగులగ
ఆరనిమంటలు తనువును కాల్చగ
దేశప్రగతికి శాంతి రూపమై
విశ్వజననికి కాంతి దీపమై
అగ్నిధారలను కురిపించాడు
రుద్రవీణలను పలికించాడు
తెలంగాణలో ప్రభాతమ్ములా
నిజాము గుండెను చీల్చు అమ్ములా
తెలుగు వెలుగులో కొత్త జిలుగులా
పూలగుండెలో మధువు తరగలా
పునర్నవమ్మును సృష్టించాడు
భావవీచికల విహరించాడు
మనసున మమతల రూపై నిలిచిన
కన్నుల వెన్నెల కాంతులు చిందిన
కవితా తరువుకు చివురులు తొడిగిన
దీనుల బతుకుల దివ్వెలు నిలిపిన
ధీర కవీంద్రుడు దాశరథి
కవిలోక రవీంద్రుడు దాశరథి
మరందగీతిక మాధురిలోన
విరిసిన నందనవనములలోన
మోగిన మువ్వల సవ్వడిలోన
పూసిన పువ్వుల నవ్వులలోన
వెన్నెలలొలికే శశి దాశరథి
నిరతము వెలిగే రవి దాశరథి.
- తిరునగరి శరత్‌చంద్ర, 6309873682

109
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles