ఆసరా


Mon,July 22, 2019 12:19 AM

నా తడారిన గొంతులోని
పొడి పొడైన దాహం
ఆకాశానికి తెలిసినట్టుంది
ఎక్కడెక్కి నుంచో మేఘాల్ని లాక్కొచ్చి
నాలుగు చినుకుల్ని రాల్చింది
నేల తల్లేమో ఒళ్లు విరుచుకొని
మట్టి వాసనై నన్ను చుట్టేసింది
విచ్చుకుంటున్న మొగ్గేమో సిగ్గిలి
ముసిముసి నవ్వుల్ని చిలికింది
చెట్టేమో కొమ్మల్ని పైకెత్తి
మబ్బుకు దండం పెట్టింది
తడి తడైన గాలేమో/ గిరగిరా తిరిగి నాట్యం చేసింది
అవును మరి, చిగురించడానికీ
ఊపిరిపొయ్యడానికీ, ఆసరా/ చినుకే కదా
మదిలో తళుక్కున మెరిసే భావన
నాలుగు అక్షరాల్ని తోడు తెచ్చుకొని
కాగితం మీద కుదురుకోవడానికీ
ఆసరా లేనిదో బయటిదో
చినుకో చినుకులాంటి/ ఆర్తో కదా
- వారాల ఆనంద్, 94405 01281

92
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles