శిలాక్షరాన్నై...


Mon,July 22, 2019 12:19 AM

ఏళ్ళ నిశ్శబ్దాన్ని కరిగించే
వాక్యమొక్కటి రాసి తీరాలి
వేల గుండెల్లో మార్మోగే
పద సమూహం పట్టి తేవాలి!
వెతల బ్రతుకును నిదురపుచ్చే
జోలపాటొకటి పాడి మురియాలి
శ్రమ జీవన సౌరభాల్ని వెదజల్లే
జానపదమై జాలువారాలి!
కదనరంగం వైపు నడిపే
కవనమొక్కటి కూర్చి పాడాలి
వైరాగ్య రాగం తిరగరాసే
వైవిధ్య గానం ఆలపించాలి!
శిశిరాలు కావలించుకున్న కోనల్లో
వసంత గీతికై పల్లవించాలి!
శిథిలాల క్రింద నలిగే సాహితిని
శిఖరాల అంచున నిలబెట్టాలి!
- సాంబమూర్తి లండ
9642732008

76
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles