మగువ


Mon,July 15, 2019 01:39 AM

maguva
పట్ట పగటి ఎండ కంటే
చుట్టుకున్న చూపుల కోత
ఏ కాలంలోను
ఎక్కువేనాయే
కష్టపడి కాలు బయటపెడితే
కాలుకు చెప్పులున్న
ఒళ్ళుకు తగిలేవి
పల్లేరుకాయ ముల్లేనాయే
తాను తప్పుకుంటు
తనువును కదిలిస్తూ
కునుకు రాని కనురెప్పై
కాలం పొరలు తిరిగేస్తుంటే
తాడు తగిలి
ఏడకో దొర్లిపడి
గబుక్కున లేచి చూస్తే
ఎదురుపడేది
ఏదో పెద్ద గద్దేనాయే
తాగి తిరిగేటి/ తప్పుడు ముళ్ళకంచెలో చేరి
పరిగ విత్తనాలేరి
చారెడు కన్నీళ్ళ ఎసరు కాచి
దుత్త తెరిస్తే/ ఉత్త నోరే చూపే
అత్త కత్తుల చూపులకు
కాలే కొవ్వొత్తై
చంకలో మొక్కకు
నీరు పడుతూ
గుక్కెడు నీళ్ళు తాగి
చుక్కలు చూస్తూ
బిక్క మొగమేసుడేనాయే
కాలాలెన్ని మారినా
సుత్తి కింద
ఇత్తడి బతుకేనాయే
మందో మాకో లేదాయే
మగువ బ్రతుకింతేనాయే.!
- వూట్ల భద్రయ్య, 95502 56840

122
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles