అస్తిత్వ ప్రకటన


Mon,July 8, 2019 12:44 AM

కంటి తెరపై చిందిన రక్తపు మరకలు
ప్రతి రక్తపు మరకా
ఓ చరిత్ర కాపలా
అగ్గి అంటుకున్న అడవినిండా
కాలిగుర్తుల కాగడాలు
నువ్వు నడిచివెళ్లిన తొవ్వ
ఇప్పుడు ఎండిన నది గొంతుక
ఆకాశాన్ని కప్పుకుని పడుకునే దేహం
బూడిదని మిగుల్చుకుంది
సముద్రాన్ని దాచుకున్న కళ్లు
తుఫానుల్ని రెప్పదాటనివ్వవు
వలస పోయిన ఋతువుల సాక్షిగ
ఇక్కడి నేల నాదే..
దేశదేశాలూ తిరిగిన గాలిదేహం సాక్షిగ
కోల్పోయిన జాతీయత నాదే..
నేనూ
దేశపటానికి వేలాడుతున్న
విశ్వనరుణ్ణి
ఖండ ఖండాలుగా సమకూర్చబడ్డ
మానవచరిత్రని...
- మెర్సీ మార్గరెట్, 9052809952

125
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles