లిఖిత, మౌఖిక ఆధారాలున్నాయి


Mon,July 15, 2019 01:41 AM

శ్రీశ్రీ చెబుతుండగా మహాస్వప్న రాశాడు అన్నదాన్ని మొత్తం రాశాడా అనే ప్రశ్న తలెత్తడం సహజమే. కానీ మొత్తం అన్న మాటను నేను రాయలేదు. అయితే మహాస్వప్న రాసింది వాస్తవం. ఇందుకు సాక్షి వడ్డేపల్లి సుధాకర్. రాసింది ఎంత భాగమో చెప్పవలిసింది శ్రీశ్రీ, మహాస్వప్నలు. వాళ్ళు ఇద్దరూ లేరు.

పత్రికా సంపాదకుడు, సాహితీవేత్త ఎన్.వేణుగోపాల్ మహాకవి మెచ్చిన మహాస్వప్న పేరుతో నమస్తే తెలంగాణ చెలిమె పేజీ (జూలై 1)లో నేను రాసిన వ్యాసంపై చారిత్రిక ఆధారాలున్నాయా..?(జూలై 8) అని సంశయాన్ని వ్యక్తం చేస్తూ వివరణ కోరారు. దేనికైనా స్పష్టమైన ఆధారాలు (మౌఖికమైనవైనా, లిఖితమైనవైనా) ఉండాలని వేణుగోపాల్ అన్నారు. చరిత్రకు వాస్తవ ఆధారాలు అవి ఎక్కడో ఒకచోట నమోదై ఉండటం, సంభవనీయమని అనిపించడం అవసరమని కూడా అన్నారు. శ్రీశ్రీ చేసిన వ్యాఖ్యల పుస్తకాన్ని ప్రస్తావిస్తూ అందులో మహాస్వప్న వివరాలను చెబుతూ.. మూడు వాక్యాలు కూడా లేవన్నారు. అది వాస్తవమే అయి ఉండవచ్చు. మహాస్వప్న కవితా ప్రతిభపై శ్రీశ్రీకి మెప్పు ఉన్నదనడానికి ఆధారాలు శ్రీశ్రీ అనంతం(పేజీ: 321) లో ఉన్నాయి. విరసంలో చేరిన దిగంబర కవులు సహా ఇతర రచయితలను వీరశైవులుగా చెబుతూ మూడు భాగాల అధ్యాయం రాశారు. విరసంలో చేరకున్నా, అది ఏర్పడిన ఎనిమిదేండ్ల తర్వాత ఒక పత్రిక సీరియల్‌గా వచ్చిన అనంతంలో మహాస్వప్నను వీరశైవునిగా గుర్తిస్తాను అంటూ ఐదు వాక్యాలు, అతనిలోని అరాజకత్వం నాకు నచ్చిందం టూ.. , ఆ తాత్విక భావన మీద మరో ఆరు వాక్యాల వివరణ రాశారు. చెరబండరాజు తర్వాత అత్యధికంగా రాసింది మహాస్వప్నపైనే. విరసంలో చేరకపోయినా, తన షష్టిపూర్తికి రాకపోయినా వీరశైవుల పేరుతో తనతో సమానమైన స్థానం ఇచ్చిన శ్రీశ్రీకి ఇది మహాస్వప్న ప్రతిభను అభిమానించడం కాదా. శ్రీశ్రీ మహాస్వప్న మీద ప్రేమతో రెండు కవితలను ఆంగ్లంలోకి తర్జుమా చేశాడని నేను రాయడానికి ఆధారం రెండు రకాలున్నాయి.

ఒకటి- 2001 ఫిబ్రవరిలో నేను లిం గసముద్రం వెళ్లి మహాస్వప్నను ఇంటర్వ్యూ చేశాను. నాటి సంగతులు చెబుతూ తన కవితాశైలిని ప్రశంసించిన విష యం కూడా చెప్పాడు. ఇందుకు సాక్ష్యం ఆయన అల్లుడు నాగేశ్వర్‌రావు. ఆయన కూడా రచయిత. నా ఇంటర్వ్యూలో భాగంగా శ్రీశ్రీ అనువాదం గురించి మహాస్వప్న చెబుతూ అందులో తన రెండు కవితలు కూడా ఉన్నాయన్నారు. అం దులో ఒకటి ఆపండి ఆర్కెస్ట్రా, రెండది మురిగిన సూర్యు న్ని నంజుకూంటూ.. అన్నవి. ఈ రెండు రచనలు శ్రీశ్రీ ఆం గ ్లరచనల సంపుటిలో చేర్చినట్టు కూడా చెప్పారు. యాభై ఏండ్ల కిందట వెలువడిన ఆ పుస్తకం పేరు శ్రీశ్రీ మిస్‌లిని. ఆ పుస్తకం నేను చూడనందున ఆయన అల్లునికి ఫోన్ చేసి శ్రీశ్రీ రెండు కవితలను అనువదించిన విషయాన్ని నిర్ధారించుకున్నాను. ఒకవేళ ఒకటే ఉంటే నేను సవరించుకుంటాను. శ్రీశ్రీని చూడటానికి అందరూ మద్రాసు వెళితే ఆయన మాత్రం మహాస్వప్నను చూడటానికి బేగంబజార్‌కు వెళ్లిన ట్టు రాసిన విషయంపై వేణుగోపాల్ సంశయం వ్యక్తం చేశా రు. 1970లకు ముందు శ్రీశ్రీని దిగంబర కవులు కలిసిన దాఖలాలు లేవంటున్నారు. ఇందుకు శ్రీశ్రీ షష్టిపూర్తికి వెళ్లి న దిగంబర కవులను చూపి అందుకు ఆధారాలు లేవంటున్నారు. అనంతం చదివితే అలాగే అనుకోవడం సహజం. శ్రీశ్రీ రాసింది కూడా కరెక్టే. అయితే వారిలో మహాస్వప్నలేడు. 1969లో దిగంబరకవుల నాలుగవ సంపుటి వెలువరించడానికి పూనుకోవడంతో రాజకీయంగా వారి వైఖరి నచ్చక దిగంబర కవుల నుంచి తప్పుకున్నాడు. భైరవయ్య ఇదేకారణం వల్ల మౌనంగా ఇంటిదారి పట్టాడు. తాను షష్టిపూర్తికి వెళ్లనిది మహాస్వప్న శ్రీశ్రీ శతజయంతి సందర్భంగా రాసిన వ్యాసంలో పేర్కొన్నాడు. అప్పటికి మిగిలింది నలుగురు దిగంబర కవులు మాత్రమే. ఆ నలుగురిని చూసి నా షష్టిపూర్తికి దిగంబర కవులు వచ్చారని అనంతంలో రాశా రు.

అలాగే.. 1969 ఉగాది రోజున శ్రీశ్రీ లాడ్జికి వెళ్లి కలిసిన విషయానికి సంబంధించి లిఖిత, మౌఖిక ఆధారాలున్నాయి. మౌఖిక ఆధారాలన్నీ శ్రీశ్రీకి ఉద్యమ సహచరులు, వారికి బాగా తెలిసినవారు చెప్పినవే. విరసం ఏర్పడక ముం దే శ్రీశ్రీ మహాస్వప్న ఉంటున్న బేగంబజార్ లాడ్జీకి వెళ్లినట్టు చెప్పింది దిగంబర కవుల్లో ఒకరు మహాస్నప్న సహచరుడు నగ్నముని గారు. మలకపేట్‌లో వారి ఇంటి దగ్గరలో ఉన్నప్పుడు తరుచుగా చర్చకు వచ్చిన సంగతుల్లో ఇదొకటి. ఈ వ్యాసం నేను రాసేముందు ఇదే విషయాన్ని మహాస్వప్న మరో సహచరుడు నిఖిలేశ్వర్‌తో చర్చించి నిర్ధారించుకున్నాను. లిఖిత పూర్వక ఆధారాల విషయానికి వస్తే.. శ్రీశ్రీ పుట్టి నూరేండ్లయినందున శత జయింతి (2009-2010) సమావేశాలు చాలా జరిగాయి. ఈ క్రమంలో ఆంధ్రజ్యోతి శతజయంతి కానుక పేరుతో ఒక కాలమ్ నిర్వహించింది. ఆ సందర్భంగా.. మహాకవి శ్రీశ్రీతో ఒక రాత్రి, దిగంబరకవి మహాస్వప్న పేరుతో ఒక పేజీ నిడివి గల ఒక వ్యాసం 20 09 ఆగస్టు 6 సంచికలో వెలువడింది. ఆ చర్చనంతా నేను ఫాలో అయ్యాను. ఇది కూడా గుర్తుపెట్టుకొని మహాస్వప్న కనుమూసిన విషయం తెలిసి ఆయన స్మృతిలో వ్యాసం రాసేందుకు సాహసించాను. నాటి తెలుగు సమాజంలో ప్రముఖలైన అనేకమంది రాజకీయ నాయకులు ఇష్టపడిన శ్రీశ్రీ తనకుతాను మహాస్వప్న ఉండే లాడ్జీకి వెళ్లి తన రూము కు ఆహ్వానించడాన్ని చదివి శ్రీశ్రీకే అభిమాన కవి అని రాశాను. ఎంతగా అభిమానించకపోతే మహాకవి ఆహ్వానిస్తా డు! అక్కడ శ్రీశ్రీ తానుగా చేసిన దిగంబరకవుల అనువాదాలు వినిపించడం, దానితర్వాత తాను అనువదించిన మరో రచన ఫ్రెంచ్ విద్యార్థి ఉద్యమంపై వచ్చిన ఆంగ్ల రచనకు తర్జుమా రెక్క విప్పిన రెవల్యూషన్‌లోని భాగాలను మహాస్వప్నకు వివరిస్తూ ఆయన అభిప్రాయాలు తెలుసుకోవడం కొనసాగింది. తెల్లవారి కలుద్దాం అంటూ 2 గంటల కు విడిపోయారు.

తెల్లవారి కలుసుకొని శ్రీశ్రీ భార్య సరోజ కూడా హోటల్‌లోనే ఉండటంతో ఆయన సహా మహాస్వప్న పక్కనే ఉన్న ఖైరతాబాద్ కల్లు కాంపౌండు దారి పట్టారు. అక్కడ మహాస్వప్న సన్నిహిత మిత్రుడు, తిరుగబడు కవు ల్లో ఒకరు, వరంగల్‌కు చెందిన వడ్డేపల్లి సుధాకర్ వారితో చేరాడు. ఇక్కడ రెక్క విప్పిన రెవల్యూషన్ కోసం కొన్ని ఆం గ్ల భాగాలు చెబుతుండగా మహాస్వప్న రాశాడు. ఇందుకు ప్రత్యక్ష సాక్షి వడ్డేపల్లి సుధాకర్. నేను ఆయనను ఫోన్లో సం ప్రదించి ఇందుకు సంబంధించిన వివరాలను నిర్ధారించుకున్నాను. ఇంతేకాకుండా ఒక ఇంటర్వ్యూలో కూడా దీనిని సుధాకర్ వెల్లడించారు. శ్రీశ్రీ చెబుతుండగా మహాస్వప్న రాశాడు అన్నదాన్ని మొత్తం రాశాడా అనే ప్రశ్న తలెత్తడం సహజమే. కానీ మొత్తం అన్న మాటను నేను రాయలేదు. అయితే మహాస్వప్న రాసింది వాస్తవం. ఇందుకు సాక్షి వడ్డేపల్లి సుధాకర్. రాసింది ఎంత భాగమో చెప్పవలిసింది శ్రీశ్రీ, మహాస్వప్నలు. వాళ్ళు ఇద్దరూ లేరు. మరో విషయం కూడా చెప్పాలి. శ్రీశ్రీ కల్లు కాంపౌడు ఘటన గురించి రాస్తూ.. వేణుగోపాల్ అసాధారణ చారిత్రిక వాస్తవం అన డం సమంజసమే. నాటికే ఎంతో ఖ్యాతిగాంచిన శ్రీశ్రీ సామాన్యులకు, ఆయన అభిమానించిన అధోజగత్తు సోదరులు, అన్నార్థులకు స్వాంతన చేకూర్చే కల్లు కాంపౌండుకు వెళ్లడం అసాధారణం. అది ఆయన గొప్పతనం.
- సామిడి జగన్‌రెడ్డి, 85006 32551

144
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles