కర్తా కారయితా చైవ ప్రేరక శ్చాను మోదకః
సుకృతే దుష్కృతే చైవ చత్వార స్సమ భాగినః
లోకంలో సహజంగానే పనులు జరుగుతూ ఉంటాయి. అందులో కొన్ని పనులు మంచివైతే, మరికొన్ని చెడ్డవిగా ఉంటాయి. మంచి పనులలోనైనా, చెడు పనులలోనైనా నలుగురు భాగస్వాములుగా ఉంటారు. వారెవరంటే..
కర్తా: చేయువాడు
కారయితా: చేయించేవాడు
ప్రేరకుడు: ప్రోత్సహించేవాడు
అనుమోదకుడు: ఆమోదించేవాడు
ఈ నలుగురు భాగస్వాములౌతారు. అందువల్ల పని చేసేటప్పుడైనా, మాట మాట్లాడునప్పుడైనా చాలా జాగ్రత్తగా ఉండవలెను.
–టి.సుధాకరశర్మ