లబ్ధా స్పదోస్మీతి వివాదభీరోః తితీక్ష మాణస్యపరేణ నిందాం
యస్యాగమః కేవల జీవికాయై తం జ్ఞాన పణ్యం వణిజం వదంతి
తా॥ కీర్తి ప్రతిష్ఠలు చాలా సమకూరినవి కదాయని వివాదాస్పదములైన సత్యాలు బయటపెట్టుటకు భయపడి ఇతరులచే నిందలను సహించు వాని విద్య కేవలము పొట్ట నింపుకొనుటకు మాత్రమే ఉపయోగపడును. అట్టివానిని చదువును అమ్ముకొని జీవించే వ్యాపారి అని చెప్పవచ్చును. కాని విద్య యొక్క పరమావధియైన లోకకల్యాణము సిద్ధించదు.
టి.సుధాకరశర్మ