కోరస్: జనన జనన జన్ జెన్జెన్నా-ధీరణ ధిరణదిన్ దిన్జన్నా
జననా దిరణా జననా దిరణా-జనన దిరణ జన్ జనన దరణ దరణ…
పల్లవి: భారతావనిన చరితగల్లదీ తెలంగాణ జననీ
బంగరు భువనంబయ్యి వర్ధిల్లె నా దక్కన్ ధరణీ
అఖండ ఖ్యాతి ఆర్జించినది నా దక్కన్ ధరణీ
కలువకుంట్ల ఆకరములచేతా పులకరించెనూ ఈ పుడమీ
అమరుల ఆశయాలు పండగా పరవశించెనూ నా ధరణీ ॥భారతా॥
చరణం: కటిక చీకటి కమ్మిన నేలన వెలుగులనే కురిపించెనా
ఎక్కిరించిన కపటనాయకుల నోళ్లకు తాళం వేసెనా
చెరువు తల్లికి శ్రమదానంతో గుండెబరువు తగ్గించెనా
సబ్బండ కులాల చేతివృత్తులకు ఆదెరువు చూపించెనా
నెర్రెలు వారిన నేలన కాళేశ్వర జలములు ప్రవహించెనా
భూతల్లి చెర విముక్తి చేసి రైతు బంధువై నిలిచెనా
కోటి ఎకరాల మాగాణిగా నా తల్లిరూపం దిద్దెనా..
రైతన్నను రాజును చేసెనా.. ॥భారతా॥
చరణం: ఫ్లోరిన్ విషంతో వెన్నువంగిన దీనులెందరినో జూసెనా
ఇంటి ఇంటికీ గొంతును తడుప కృష్ణమ్మ పారించెనా
దిక్కుమొక్కులేని జనానికి ఆసరా అయ్యి నిలిచెనా
ఆడబిడ్డల కల్యాణానికి కట్నమయ్యి కరుణించెనా
కరువు కాటకాలపోనీకి కోట్ల మొక్కలను పంచెనా
పల్లెలూ పట్టణాల మోములో దరహాసం పూయించెనా
ఎనిమిదేండ్ల పరిపాలనలోనా ప్రగతిని ఎంతో పెంచెనా…
నా తల్లి ప్రతిష్ఠను పెంచెనా.. ॥భారతా॥
చరణం: చదువుకున్న నా యువతరానికి కొలువులకై పిలుపిచ్చెనా
పరిశ్రమల ప్రాధాన్యం పెంచి నిరుద్యోగమును తరిమెనా
విద్యావైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చెనా
దళిత బతుకులను మార్చగ దళిత బంధువై కదిలెనా
అంబేద్కర్ కలగన్న ఆర్థిక ప్రగతిన అడుగు వేసెనా
కులం మతం లేదంటూ అందరి సంక్షేమానికి కంకణం కట్టి కదిలెనా
తెలంగాణ చరితనే మార్చెనా… ॥భారతా॥
-రాచకొండ రంగన్న, 90328 45528