కావ్యశాస్త్ర వినోదేన
కాలో గచ్ఛతి ధీమతామ్
వ్యసనేన చ మూర్ఖాణాం
నిద్రయా కలహేన వా॥
బుద్ధిమంతులు సంగీతం, సాహిత్యం, విద్య, వాఙ్మయం, శాస్త్ర అధ్యయనాలతో తమ కాలాన్ని సద్వినియోగం చేస్తారు. జీవితంలో ఉన్నత మార్గాన్ని అనుసరించి ఉన్నతిని సాధిస్తారు. పదుగురికి ఆదర్శంగా నిలుస్తారు. కానీ మూర్ఖులు మాత్రం నిద్ర, తగాదాలు, వ్యసనాలతో తమ సమయాన్ని వృథాగా గడుపుతారు. ఏ విధమైన ఫలప్రదమైన కార్యాన్ని తలపెట్టకుండా వృద్ధిని పొందకుండా వెనుకబడిపోతారు. తమ వెనుకబాటుతనానికి ఇతరులు కారణమని ఈర్ష్యాద్వేషాలతో గడుపుతారు.