ఉద్యోగానికో, చదువుకో ఇండియా నుంచి చాలా మంది అమెరికా వెళ్తారు. అలా వెళ్లిన వారిలో ఒకరు.. వేములవాడకు చెందిన కళ్యాణి బొప్ప. బీటెక్ తర్వాత హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేసిన కళ్యాణి.. పెండ్లి చేసుకుని అమెరికా వెళ్లారు. అక్కడ కూడా ఉద్యోగాన్ని కొనసాగిస్తూనే.. అమెరికా సంగతులను మన వారితో పంచుకోవాలన్న ఆశతో ‘అమెరికాలో అమ్మకుట్టి’ అనే యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించారు. డాలర్ల దేశంలో మన పండుగలు ఎలా చేసుకుంటారు, అక్కడ ఏమేం దొరుకుతాయి, ఆ దేశంలో తరచూ జరిగే ఈవెంట్లు, తాను తిరిగిన ప్రదేశాలు..
ఇలా వివిధ అంశాలను వీడియోల్లో చూపిస్తారు. అంతేకాదు, తన రోజువారీ జీవితాన్నీ కెమెరాలో బంధిస్తారు. సొంత ఇల్లు ఎలా కొనుక్కున్నారు, ఎలా రెనోవేట్ చేసుకున్నారు, ప్రెగ్నెన్సీ సమయంలో అక్కడి వైద్య పరీక్షలు ఎలా ఉంటాయి, ఇంటి నుంచి వచ్చిన సారె ఏంటి… ఇలా తన జీవితంతో ముడిపడిన సంగతులన్నీ యూట్యూబ్ ద్వారా వీక్షకులతో పంచుకుంటారు. ఆమె చెప్పే విధానం నచ్చి చాలామంది సబ్స్ర్కైబర్లుగా మారారు. వీడియోల్లో తన డ్రెస్సింగ్‌కు మంచి కామెంట్లు వస్తుండటంతో ‘హౌస్ ఆఫ్ కళ్యాణి బొప్ప’ పేరుతో బొటిక్నూ ప్రారంభించారు.