e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home లైఫ్‌స్టైల్‌ అద్దం నేర్పిన నటన - కీర్తి తండ్రి సురేష్‌ కుమార్‌ సినీ నిర్మాత.

అద్దం నేర్పిన నటన – కీర్తి తండ్రి సురేష్‌ కుమార్‌ సినీ నిర్మాత.

అద్దం నేర్పిన నటన - కీర్తి తండ్రి సురేష్‌ కుమార్‌ సినీ నిర్మాత.
  • కీర్తి తండ్రి సురేష్‌ కుమార్‌ సినీ నిర్మాత. మలయాళ ఇండస్ట్రీలో మంచిపేరుంది. తల్లి మేనక నిన్నటి తరానికి కథానాయికగా పరిచయం. చిన్నప్పటి నుంచి ఇంట్లో సినిమా వాతావరణాన్ని చూస్తూ పెరిగింది కీర్తి. దాంతో నటనపై కూడా ఆసక్తి పెరుగుతూ వచ్చింది. ‘స్కూల్‌డేస్‌లో కీర్తి అద్దం ముందు గంటల కొద్దీ నిల్చునేది. 
  • రకరకాల హావభావాలు పలికిస్తూ కాలక్షేపం చేస్తుండేది. నటనలో మెలకువలన్నీ అద్దం ముందే నేర్చుకుంద’ని చెబుతారు కీర్తి తల్లి మేనక.చిన్నప్పట్నించీ కీర్తి యాక్టర్‌ అవ్వాలనే అనుకునేదట. నటన కేవలం తన వృత్తి కాదని, అదే తన ప్రపంచమని చెబుతుంటుంది. షూటింగ్‌ సమయంలో అప్పటికప్పుడు నటించేస్తుంటుంది. రిహార్సల్స్‌ గట్రా ఆమెకు తెలియవని కీర్తి ఇండస్ట్రీ స్నేహితుల మాట. ‘నా క్యారెక్టర్‌కి సంబంధించిన సీన్స్‌ అన్నీ నా సబ్‌కాన్షియస్‌ మైండ్‌లో తిరుగుతూనే ఉంటాయి. అందువల్ల ప్రత్యేకంగా రిహార్సల్స్‌ ఏమీ చేయను’ అంటుంది కీర్తి.
  • రోజురోజుకూ ప్రేక్షకులకు సినిమా చేరువవుతున్న తీరు మారుతున్నది. లాక్‌డౌన్‌ నుంచి అన్ని భాషల సినిమాల్లో అరవైశాతం థియేటర్లలో కాకుండా ఓటీటీ వంటి ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాముల్లో రిలీజ్‌ అవుతున్నాయి. కీర్తి నటించిన ‘పెంగ్విన్‌’ అమెజాన్‌ ప్రైమ్‌లో, ‘మిస్‌ ఇండియా’ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యాయి. ఈ చిత్రాలు మిక్స్‌డ్‌ టాక్‌ సొంతం చేసుకున్నా.. నటన పరంగా కీర్తికి మంచిపేరు తెచ్చాయి. 
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అద్దం నేర్పిన నటన - కీర్తి తండ్రి సురేష్‌ కుమార్‌ సినీ నిర్మాత.

ట్రెండింగ్‌

Advertisement