కుమ్ర౦ భీం అసిఫాబాద్ : జిల్లాలోని వాంకిడి మండలం ఖమాన గ్రామం శివారులో పేకాట స్థావరాలపై వాంకిడి ఎస్ఐ దీకొండ రమేష్ దాడులు నిర్వహించారు. ఖమాన గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వీరి నుంచి రూ. 6 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు. అదుపులోకి తీసుకున్న వారిపై కేసు నమోదు చేశామన్నారు. ఎవరైనా పేకాట, మట్కా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు.