e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, November 27, 2021
Home ఆదిలాబాద్ నాలుగున్నర గంటలు.. ఎనిమిది అంశాలు

నాలుగున్నర గంటలు.. ఎనిమిది అంశాలు

  • ఆసిఫాబాద్‌లో జడ్పీ చైర్‌పర్సన్‌ అధ్యక్షతన సమావేశం
  • పాల్గొన్న ఎమ్మెల్సీ, కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌
  • పలు సమస్యలను సభ దృష్టికి తెచ్చిన సభ్యులు
  • పర్యాటక అభివృద్ధికి రూ.141 కోట్లతో నివేదికలు : పురాణం

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలోని వడ్డెపల్లి గార్డెన్‌లో మంగళవారం జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశం ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌, కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కనక యాదవ్‌రావ్‌తో పాటు ఎంపీపీ, జడ్పీటీసీలు హాజరుకాగా, అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు. ఉదయం 11.30 గంటలకు సమావేశం ప్రారంభం కాగా, నాలుగున్నర గంటలు ఎనిమిది అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు సమస్యలను సభ దృష్టికి తీసుకు వచ్చారు. జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రూ.141 కోట్లతో సర్కారు నివేదికలు పంపినట్లు ఎమ్మెల్సీ పురాణం తెలిపారు.

కుమ్రం భీం ఆసిఫాబాద్‌, ఆక్టోబర్‌ 12 (నమస్తే తెలంగాణ)

- Advertisement -

కుమ్రం భీం ఆసిఫాబాద్‌, ఆక్టోబర్‌ 12 (నమ స్తే తెలంగాణ) : ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలోని వడ్డెపల్లి గా ర్డెన్‌లో మంగళవారం జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌, కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణ,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కనక యా దవ్‌రావ్‌ హాజరయ్యారు. ఉదయం 11.30 గంటలకు సమావేశం ప్రారంభం కాగా, నాలుగున్నర గంటలపాటు ఎనిమిది అంశాలపై చర్చించారు. మొదట అటవీ శాఖపై చర్చ జరిగింది. జిల్లాలోని గుండాల, కమ్మర గాం ప్రాం తాలను పూర్తిస్థాయిలో పర్యాటక ప్రాం తాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు అటవీ శాఖ అధికారి శాంతారాం తెలిపారు. ఇందుకోసం సమీప గ్రామాల ప్రజలతో కమిటీలను వేస్తున్నట్లు తెలిపారు. జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేయడం వల్ల జిల్లాకు మంచి ఆదాయం సమకూరుతుందన్నారు. ఇప్పటికే కుమ్రం భీం ప్రాజెక్టు సమీపంలో రూ. 3 కోట్లతో అర్బన్‌ పార్క్‌ను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. కాగజ్‌నగర్‌ డివిజన్‌లోని వేంపల్లి దగ్గర మరో అర్బన్‌ పార్క్‌ను ఏర్పాటు చేశామని చెప్పా రు. అటవీశాఖ అభ్యంతరాల వల్ల నిలిచిపోయిన రోడ్లకు త్వరలోనే అనుమతులు రానున్నట్లు తెలిపారు. ఇప్పటికే 27 రోడ్లకు అనుమతులు వచ్చాయన్నారు. ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌ క ల్పించుకొని మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు రూ. 141 కోట్ల తో నివేదికలు రూపొందించి సర్కారుకు అందించామన్నారు. జిల్లాలోని వైద్యశాఖలోని ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం వంటి పోస్టులను స్థానికులతో భర్తీచేయాలని సభ్యులు కోరారు. ఈ మేరకు ప్రత్యేకంగా గిరిజన అభ్యర్థులను ఎంపిక చేసి, వారికి శిక్షణ ఇచ్చి పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు అడ్డంగా, రోడ్లపై పెట్టిన టేలాలను తొలగించాలని జడ్పీ చైర్‌ పర్సన్‌ కోవ లక్ష్మి జిల్లా పంచాయతీ అధికారులను ఆదేశించారు. 20న జోడేఘాట్‌లో నిర్వహిం చే కుమ్రం భీం వర్ధంతి సభ పోస్టర్‌ను విడుదల చేశారు. విద్య, వైద్యం, రోడ్లు, భవనాల శాఖ, వ్యవసాయం, అట వీ శాఖ, జిల్లా పంచాయతీ, మహిళా శిశు సంక్షేమ శాఖలపై అధికారులు నివేదికలు వినిపించారు. ఆయా శాఖ పనితీరుపై సమావేశంలో పాల్గొన్న ఎంపీపీలు, జడ్పీటీలు చర్చిస్తూ తమ ప్రాంతాలోని సమస్యలను వివరించారు. అనంతరం ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌ను సన్మానించారు. ఎంపీపీలు, జడ్పీటీసీలు, అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు డీసీసీబీ చైర్మన్‌ కాంబ్లే నాందేవ్‌ మృతి పట్ల సభ్యులు సంతాపం ప్రకటించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement