e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home కొమరంభీం సింగరేణి దవాఖాన సేవలు భేష్‌

సింగరేణి దవాఖాన సేవలు భేష్‌

కొవిడ్‌ నుంచి ప్రజలను కాపాడుకున్నాం
థర్డ్‌ వేవ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటాం
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
బెల్లంపల్లిలో రూ. 36 లక్షలతో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ప్రారంభం
పాల్గొన్న సింగరేణి డైరెక్టర్లు బలరాం, సత్యనారాయణ, టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు వెంకట్రావ్‌
రామకృష్ణాపూర్‌ ఏరియా హాస్పిటల్‌లోనూ..

బెల్లంపల్లిటౌన్‌, జూలై 30 : బెల్లంపల్లి సింగరేణి దవాఖాన సేవలు భేష్‌ అని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. కొవి డ్‌ కేంద్రంలో రూ. 36 లక్షలతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌ జనరేటర్‌ ప్లాంట్‌ను సింగరేణి డైరెక్టర్లు బలరాం, సత్యనారాయణరావు, టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు వెంకట్రావ్‌తో కలిసి శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కలెక్టర్‌, సింగరేణి ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఎప్పటికప్పుడూ సూచనలు చేస్తూ ప్రజలను కాపాడుకున్నామన్నారు. థర్డ్‌ వేవ్‌ వచ్చినా కూడా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దవాఖానలో ప్రత్యేక వైద్య నిపుణుల నియామకానికి సింగరేణి యాజమాన్యం చొరవ చూపాలని కోరారు. అనంతరం డైరెక్టర్‌ బలరాం మాట్లాడుతూ సింగరేణివ్యాప్తంగా ఐదు ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఇందులో గోదావరిఖనిలో 150 రోగులకు, బెల్లంపల్లిలో 90 మంది రోగులకు ఆ క్సిజన్‌ అందించే ప్లాంట్లను ఏ ర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సింగరేణిలో వ్యాక్సినేషన్‌ దా దాపుగా పూర్తయిందన్నారు. వెంకట్రావ్‌ మాట్లాడుతూ కరోనా సమయంలో కార్మికులు, వారి కుటుంబాలకు వైద్యం అందించడానికి యాజమాన్యం రూ. 50 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. అంతకు ముందు దవాఖాన ఆవరణలో వారు మొ క్కలను నాటారు. కార్యక్రమంలో పర్సనల్‌ కార్పొరేట్‌ జీఎం ఆనందరావు, బెల్లంపల్లి ఏరియా జీఎం సంజీవరెడ్డి, దవాఖాన సూపరింటెండెంట్‌ రామల శౌరీ, టీబీజీకేఎస్‌ ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజ్‌ శ్రీనివాసరావు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బత్తుల సుదర్శన్‌, పిట్‌ కార్యదర్శులు అనుముల సత్యనారాయణ, దాసరి శ్రీనివాస్‌, నాయకులు గెల్లి రాజలింగు, బడికెల రమేశ్‌, చెవిటి సుదర్శన్‌, వెంకటరమణ పాల్గొన్నారు.
ఏరియాలోనే పోస్టింగ్‌ ఇవ్వాలి..
సింగరేణిలో నూతనంగా నియామకం అవుతున్న కార్మికులకు బెల్లంపల్లి ఏరియాలోనే పోస్టింగ్‌ ఇవ్వాలని బెల్లంపల్లి ఏరియా టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు డైరెక్టర్‌ బలరాం, పర్సనల్‌ జీఎం ఆనందరావుకు వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా మాదారం, గోలేటి టౌన్‌ షిప్‌లలో ఖాళీగా ఉన్న క్వార్టర్లను విశ్రాంత కార్మికులు, కాంట్రాక్ట్‌ కార్మికులకు నామమాత్రపు అద్దె ప్రాతిపదికన కేటాయించాలని విన్నవించారు. చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు.
రామకృష్ణాపూర్‌ ఏరియాసుపత్రిలో ప్లాంట్‌ ప్రారంభం
మందమర్రి జూలై 30: మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్‌ ఏరియాసుపత్రిలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ను సింగరేణి డైరెక్టర్లు బలరాం, సత్యనారాయణరావు స్థానిక అధికారులు, కార్మిక సంఘాల నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ప్లాంట్‌ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామకృష్ణాపూర్‌ ఏరియా ఆసుపత్రిలో 35 లక్షల వ్యయంతో నిర్మించామని, ఇందులో రోజుకు 40 సిలిండర్లు అంటే రెండు లక్షల 50 వేల లీటర్ల ఆక్సిజన్‌ ఉత్పత్తి అవుతుందని వారు తెలిపారు. ప్లాంట్‌ నిర్మాణం త్వరగా పూర్తిచేసేందుకు కృషి చేసిన ఏరియా జీఎం చింతల శ్రీనివాస్‌ను వారు అభినందించారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షుడు వెంకట్రావ్‌, జీఎం పర్సనల్‌ కార్పొరేట్‌ ఆనందరావు, శ్రీరాంపూర్‌ జీఎం సురేశ్‌, ఏజీఎం(ఈఅండ్‌ఎం) జగన్‌ మో హన్‌రావు, ఏజీఎం ఎఫ్‌ అండ్‌ఏ చక్రవర్తి, టీబీజీకేఎస్‌ ఏరి యా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్‌, ఏఐటీయూసీ కార్యదర్శులు అక్బర్‌ అలీ, సత్యనారాయణ, అధికారుల సంఘం అధ్యక్షుడు జక్కారెడ్డి, డీజీఎం(సివిల్‌) శ్రీనివాసులు, డీజీఎం(వర్క్‌షాప్‌) నరసింహరాజు, డీవైసీఎంవో ఉషారాణి, పీఎం వరప్రసాద్‌, వివిధ విభాగాల అధికారులు, వైద్యులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana