e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home కొమరంభీం అన్నీ దొరికే అంగడి

అన్నీ దొరికే అంగడి

అన్నీ దొరికే అంగడి
  • జోరుగా వ్యాపారం.. వందలాది మందికి ఉపాధి..
  • చేపలు, మేకలకు భలే గిరాకీ..
  • మూడు దశాబ్దాల చరిత్ర


తాండూర్‌, ఏప్రిల్‌ 27 : మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలోని ఐబీలో కొత్తపల్లి రైల్వేగేట్‌ పక్కన నిర్వహించే కూరగాయలు, మేకల సంతకు ఆదరణ లభిస్తున్నది. ప్రతి శనివారం ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు సంత కొనసాగుతుంది. మండల ప్రజలతోపాటు చుట్టు పక్కల మండలాల ఉద్యోగులు, విద్యార్థులు, మాదారం, గోలే టి టౌన్‌షిప్‌ కాలనీలకు చెందిన కార్మికులు, ఉద్యోగులు వచ్చి కూరగాయలతోపాటు త మకు కావాల్సిన వస్తువులు కొనుక్కొని వెళ్తుంటారు. ఈ సంతలో తాజా ఆకు కూ రలు, కూరగాయలతోపాటు వంట సామా గ్రి వస్తువులు తక్కువ ధరకే లభిస్తాయి. చేపలు, నాటు కోళ్లు, బట్టలు, ఆట వస్తువులు, మహిళలకు కావాల్సిన సౌందర్య వస్తువులు, పండ్లు, పూలు, తినుబండరాలు, సీజన్‌ను బట్టి ఆయా రకాల పంటల ఉత్పత్తులు ఇలా ఒకటేమిటి సర్వం ఇక్కడ దొరుకుతాయి. జిల్లా నుంచే కాకుండా పక్క జిల్లాల రైతులు పండించిన కూరగాయలను ఇక్కడికి తెచ్చి విక్రయిస్తారు.
మేకల సంతకు భలే గిరాకీ..
తాండూర్‌లో ప్రతి శనివారం జరిగే మేకల సంతకు భలే గిరాకీ ఉంటుంది. జి ల్లా నుంచే కాకుండా పక్క జిల్లాలు, మహారాష్ట్ర నుంచి భారీ సంఖ్యలో అమ్మకందారులు, కొనుగోలుదారులు వస్తుంటారు. ఏ పండగైనా, ఎలాంటి శుభకార్యమైనా ఇక్కడికి వచ్చి మేకలు, గొర్లు కొనుగోలు చేస్తుంటారు. అలాగే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు సత్ఫలితాలనిస్తున్నాయి. చెరువు, కుంటల్లో ఉచితంగా చేప పిల్లల పంపిణీ, మత్స్యకారులకు వాహనాలు అందించడం తో సంతలోకి చేపలు తెచ్చి అమ్ముతున్నా రు. తాండూర్‌ సంతలో తాండూర్‌తోపాటు పక్క మండలాల మత్స్యకారులే కాకుండా కుమ్రం భీం జిల్లా వట్టివాగు, అడ ప్రాజెక్ట్‌, చెలిమెల వాగు ప్రాజెక్ట్‌ చేపలను తీసుకువ చ్చి ఇక్కడ విక్రయిస్తుంటారు. సంతలో కో రమీన, రవ్వు, బంగారుతీగ, బొచ్చ, గ్యాస్‌కిట్‌, జెల్ల తదితర చేపలు దొరుకుతాయి.
మూడు దశాబ్దాల అంగడి
మండల కేంద్రంలో నిర్వహించే వారసంత సుమారు 30 ఏండ్ల క్రితం ప్రారంభమైనట్లు పెద్దలు చెబుతున్నారు. గతంలో ఈ ప్రాంతంలో దాదాపు 15 వరకు సింగరేణి భూగర్భ గనులు ఉండేవి. కార్మికులు, అధికారుల సౌకర్యార్థం అప్పటి కొత్తపల్లి ఉమ్మడి గ్రామపంచాయతీ సర్పంచ్‌, ఈవోలు తాం డూర్‌ ఐబీ సరిహద్దులోని కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధిలో సంతను ఏర్పాటు చేసినట్లు ప్రతీతి. వారసంత మండల ప్రజలకు సంవత్సరాలుగా సేవలందిస్తున్నది.

ప్రతి వారం 50 మేకలు అమ్ముతం
మేము మంచిర్యాల, మందమర్రి, ఆసిఫాబాద్‌, వాంకిడి, మహారాష్ట్ర నుంచి మేకలు కొని తీసుకొచ్చి ఈ సంతలో అమ్ముతాం. పదహారేండ్ల నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తున్నాం. ప్రతి వారం 50కిపైగా మేకలు అమ్ముతం. నాలాంటి వ్యాపారులు ఎందరో ఈ సంతకు వస్తారు. అందరం కలిసి తక్కువ ధరకే మేకలను అమ్ముతాం. అందుకే ఈ సంతకు చాలా పేరు వచ్చింది.

  • మొగిలి అంజన్న మందమర్రి, మేకల వ్యాపారి
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అన్నీ దొరికే అంగడి

ట్రెండింగ్‌

Advertisement