బుధవారం 03 మార్చి 2021
Komarambheem - Feb 22, 2021 , 02:46:30

తెలంగాణలో సుభిక్షంగా రైతులు..

తెలంగాణలో సుభిక్షంగా రైతులు..

బెజ్జూర్‌, ఫిబ్రవరి 21 : దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయాభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రంలో రైతులు సుభిక్షంగా ఉన్నారని, సీఎంగా కేసీఆర్‌ ఉండడం అన్నదాత అదృష్టమని సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంతోపాటు ఊట్సారంగపల్లి, కుకుడ, సోమిని నాలుగు వ్యవసాయ క్లస్టర్లలో రైతు వేదికలను ఎంపీపీ రోజారమణి, సహకార సంఘం చైర్మన్‌ అర్షద్‌ హుస్సేన్‌లతో కలిసి ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోఎక్కడా లేని విధంగా రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్‌,  కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, అందుబాటులో ఎరువులు, విత్తనాలు,  రైతు వేదికలు, తదితర పథకాలను సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్నారని కొనియాడారు. ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనం, శ్మశాన వాటిక, డంప్‌ యార్డు, సెగ్రిగేషన్‌ షెడ్ల నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. 16 గ్రామాల్లో త్రీ ఫేజ్‌ విద్యుత్‌ సరఫరా చేస్తామని తెలిపారు. కుకుడ కాటెపల్లి, సోమిని, మొగవెళ్లి, సలుగుపల్లి-మర్తి రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పంద్రం పుష్పలత, ఏవో రాజుల నాయుడు, ఎంపీడీవో రాజేందర్‌, డీటీ రవీందర్‌, టీఎస్‌ ఈడబ్ల్యూఐడీసీ శాఖ డీఈ శ్రీనివాస్‌, కౌటాల సీఐ శ్రీనివాస్‌, ఎస్‌ఐ సాగర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు సిడాం సకారాం, సర్పంచ్‌లు అన్సార్‌ హుస్సేన్‌, కుంరం హన్మం తు, అసియాభాను, ఎలాది శారద, నాయకులు కుర్సింగ ఓంప్రకాశ్‌, డోకె వెంకన్న, పుల్లూరి సతీశ్‌, దందెర ఇస్తారి, జావీద్‌ అలీఖాన్‌, పురుషోత్తం, ఖాజామైనుద్దీన్‌, ఏఈవోలు రవితేజ, మారుతి, శ్రీధర్‌, మీనా, ఆయా జీపీల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ నాయకులు, రైతులున్నారు. 


VIDEOS

logo