శనివారం 06 మార్చి 2021
Komarambheem - Jan 27, 2021 , 01:50:05

రెపరెపలాడిన త్రివర్ణ పతాకం

రెపరెపలాడిన త్రివర్ణ పతాకం

  • ఊరూరా  ‘గణతంత్ర’ వేడుకలు
  • జాతీయ పతాకాలను ఆవిష్కరించిన అధికారులు, నాయకులు  

గణతంత్ర దినోత్సవాన్ని మంగళవారం  జిల్లా కేంద్రం,  కాగజ్‌నగర్‌తో పాటు ఊరూరా ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలు,  గ్రామ పంచాయతీ కార్యాలయాలు, విద్యాలయాల వద్ద జాతీయ జెండాను అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు ఎగురవేశారు. 

ఆసిఫాబాద్‌ టౌన్‌,జనవరి26 : కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌,  కోర్టు ఆవరణలో జిల్లా మూడో అదనపు న్యాయమూర్తి నారాయణ బాబు,  రాంబాబు, వివిధ శాఖల కార్యాలయాల్లో ఏఎస్పీ సుధీంద్ర, ఎంవీఐ ఉమామహేశ్వర్‌ రావు, డీఎంఅండ్‌హెచ్‌వో కుమ్రం బాలు, డీఎఫ్‌వో శాంతారాం, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి సావిత్రి, విద్యాసంస్థల హెచ్‌ఎంలు, ప్రిన్సిపాళ్లు, వివిధ పార్టీలు,  సంఘాల నాయకులు, అధికారులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. 

ఆకట్టుకున్న 180 ఫీట్ల త్రివర్ణ పతాకం..

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని యువకులు 180 ఫీట్ల భారీ జాతీయ జెండాను తయారు చేసి ప్రధాన వీధుల గుండా ప్రదర్శించారు. అనంతరం అంబేద్కర్‌ చౌరస్తా వద్ద మానవహారం నిర్వహించారు. 

కాగజ్‌నగర్‌టౌన్‌, జనవరి 26 : పట్టణంలోని గాంధీచౌక్‌లో సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప జాతీయ జెండాను ఆవిష్కరించారు. వివిధ కాలనీలు, కార్యాలయాల వద్ద ఆర్డీవో ఆర్‌ఎస్‌ చిత్రు, జడ్పీ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు, మున్సిపల్‌ చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌, ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో శిక్షకుడు సుజన్‌కుమార్‌, ఐఎంఏ భవనంలో డాక్టర్‌ కొత్తపల్లి అనిత శ్రీనివాస్‌,  బస్టాండ్‌ ప్రాంగణం లో పట్టణ ఎస్‌హెచ్‌వో మోహన్‌, కోనేరు చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ కోనేరు వంశీకృష్ణ   జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ విద్యావతి,  రాజ్‌కుమా ర్‌, కౌన్సిలర్లు, నాయకులు, తదితరులున్నారు. 

రెబ్బెన, జనవరి26 : సింగరేణి బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి జీఎం కార్యాలయంలో జీఎం సంజీవరెడ్డి జెండా ఆవిష్కరించారు. ఉత్తమ కార్మికులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్‌ ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు. వివిధ కార్యాలయాల వద్ద తహసీల్దార్‌ రియాజ్‌అలీ, సీఐ సతీశ్‌కుమార్‌, ఎస్‌ఐ దీకొండ రమేశ్‌,  పశువైద్యాదికారి సాగర్‌, పీహెచ్‌సీ డాక్టర్‌ భరత్‌, ఎంపీడీవో సత్యనారాయణసింగ్‌, సర్పంచ్‌లు, నాయకులు  జాతీయ జెండాలను ఆవిష్కరించారు. 

కెరమెరి, జనవరి 26 : మండలంలో వివిధ కార్యాలయాల వద్ద  తహసీల్దార్‌ సంతోష్‌ కుమార్‌,  పీహెచ్‌సీ డా.సుమంగళి,  ఎంపీడీవో దత్తరాం, పీఏసీఎస్‌ చైర్మన్‌ మోహర్లే శంకర్‌, కేజీబీవీ ప్రత్యేక అధికారి పీ మీనా, సర్పంచ్‌లు,  ప్రధానోపాధ్యాయులు జెండాలను ఆవిష్కరించారు. ఎంపీపీ పెందోర్‌ మోతీరాం, వైస్‌ ఎంపీపీ అబూల్‌ కలాం, నాయకులు పాల్గొన్నారు.

జైనూర్‌: మండలంలో వివిధ కార్యాలయాల వద్ద తహసీల్దార్‌ సాయన్న,  ఎంఈవో సుధాకర్‌, ఎస్‌ఐ తిరుపతి, మార్కెట్‌ కార్యాలయంలో కార్యదర్శి ఆజం అలీ ఖాన్‌, రాష్ట్ర హజ్‌ కమిటీ సభ్యుడు ఇంతియాజ్‌లాలా, వ్యవసాయ శాఖ అధికారి పవన్‌కుమార్‌, సర్పంచ్‌ పార్వతి లక్ష్మణ్‌, ప్రభుత్వ దవాఖాన డాక్లర్‌ నాగేంద్ర, సర్పంచ్‌లు, నాయకులు, అధికారులు జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కుమ్ర తిరుమల,   వైస్‌ ఎంపీపీ చిర్లె లక్ష్మణ్‌ ,  ఎంపీటీసీలు, నాయకులున్నారు.  

 కౌటాల, జనవరి 26 : మండలంలో వివిధ శాఖల కార్యాలయాల వద్ద  పశు వైద్యాధికారి శ్రీకాంత్‌, పీఏసీఎస్‌ సీఇవో రాజేశ్‌, ఐకేపీలో ఏపీఎం మోహన్‌లాల్‌, ఎంఈవో సోమయ్య, ఎంపీడీవో ప్రభు, ఎంఏవో రాజేశ్‌,  సీఐ శ్రీనివాస్‌, ఎంపీపీ బసార్కర్‌ విశ్వనాథ్‌, తహసీల్దార్‌ రాజేశ్వరీ, ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు సర్పంచ్‌లు, అధికారులు జెండాలను ఆవిష్కరించారు. డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌ కుమ్రం మాంతయ్య మండల నాయకులు, ప్రజాప్రతినిధులున్నారు.. 

చింతలమానేపల్లి, జనవరి 26 : మండలంలోని వివిధ శాఖల కార్యాలయాల వద్ద  ఎంపీపీ డీ నానయ్య, తహసీల్దార్‌ బికర్ణదాస్‌, పోలీస్‌ అధికారి సందీప్‌కుమార్‌, సర్పంచ్‌లు, కార్యదర్శులు, నాయకులు జెండాలను ఆవిష్కరించారు. 

బెజ్జూర్‌, జనవరి 26 : మండలంలో వివిధ కార్యాలయాల వద్ద తహసీల్దార్‌ రవీందర్‌, ఎంపీపీ డోకె రోజారమణి, ఎస్‌ఐ సాగర్‌, వైద్యాధికారి రుషీ, సహకార సంఘం  చైర్మన్‌ అర్షద్‌ హుస్సేన్‌, అటవీ శాఖ రేంజర్‌ దయాకర్‌, వివిధ శాఖల హెచ్‌ఎంలు, ప్రిన్సిపాళ్లు, సంఘాల నాయకులు జెండాలను ఎగురవేశారు.  ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజేందర్‌, ఏఈ సారంగపాణి, ఎంపీటీసీ పర్వీన్‌ సుల్తానా, నాయకులు, అధికారులు  పాల్గొన్నారు. 

దహెగాం, జనవరి 26 : మండలంలో వివిధ కార్యాలయాల వద్ద తహసీల్దార్‌ రామ్మోహన్‌, ఎంపీడీవో సత్యనారాయణ, ఎస్‌ఐ రఘుపతి, పీహెచ్‌సీ వైద్యాధికారి చంద్రకిరణ్‌, కస్తూర్బా ఎస్‌వో రమాదేవి, ఐకేపీ ఏపీఎం, సర్పంచ్‌ పుప్పాల లక్ష్మి, వ్యవసాయ శాఖ అధికారి శోభన్‌, సొసైటీ చైర్మన్‌ కోండ్ర తిరుపతి గౌడ్‌, ఆయుర్వేద వైద్యాధికారి రాజేందర్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ప్రసాద్‌ రాజు, వివిధ శాఖల అధికారులు , ఉపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు సర్పంచ్‌లు, నాయకులు జెండాలను ఆవిష్కరించారు. 

కాగజ్‌నగర్‌ రూరల్‌, జనవరి 26 : మండలంలోని వివిధ కార్యాలయాల వద్ద జాతీయ జెండాను తహసీల్దార్‌ ప్రమోద్‌కుమార్‌, ఎంపీడీవో, పీఏసీఎస్‌ చైర్మన్‌ ఉమామహేశ్వర్‌రావు, ఈజ్‌గాం పోలీస్టేషన్‌లో ఎస్‌ఐ సందీప్‌కుమార్‌, ఈజ్‌గాం పీహెచ్‌సీలో వైద్యుడు సీతారాం, సర్పంచ్‌లు, నాయకులు జెండాలను ఆవిష్కరించారు.  

పెంచికల్‌పేట్‌, జనవరి 26 : మండలంలోని కార్యాలయాల వద్ద ఎంపీపీ జాజిమొగ్గ సుజాత, తహసీల్దార్‌ రఘునాథ్‌రావు, పీహెచ్‌సీ డాక్టర్‌ ముస్తఫా, ఎస్‌ఐ రమేశ్‌, పాఠశాలలు, కళాశాలల వద్ద హెచ్‌ఎంలు, ప్రిన్సిపాళ్లు, గ్రామాల్లో సర్పంచ్‌లు, నాయకులు జెండాలను ఆవిష్కరించారు. 

లింగాపూర్‌, జనవరి26 :  మండలంలో వివిధ కార్యాలయాల వద్ద  అధికారులు, ప్రజాప్రతినిధులు జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సవిత, వైస్‌ ఎంపీపీ ఆత్మారాం, జడ్పీటీసీ రేఖాబాయి, కో ఆప్షన్‌ సభ్యుడు సలీం, సర్పంచ్‌లు, నాయకులు, పాల్గొన్నారు. 

సిర్పూర్‌ (టీ) , జనవరి 26 :మండల కేంద్రంలోని జూనియర్‌ సివిల్‌ కోర్టులో మెజిస్ట్రేట్‌ రామారావు, వివిధ శాఖల కార్యాలయాల్లో తహసీల్దార్‌ లింగమూర్తి, ఎంపీడీవో రాజేశ్వర్‌, సామాజిక దవాఖానలో వైద్యురాలు నవత,  వ్యవసాయ శాఖ ఈవో కవిత, ఎస్‌ఐ రవికుమార్‌, సహకార బ్యాంకు మేనేజర్‌ ఎం శ్రీనివాస్‌, అధికారులు, సిర్పూర్‌ మేజర్‌ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌ తఫీమా పర్వీన్‌,  జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎంపీపీ చునార్కార్‌ సువర్ణ, వైస్‌ ఎంపీపీ సత్య నారాయణ, ఎంపీటీసీలు సోహైల్‌ అహ్మద్‌, మంగీలాల్‌, కారెం శైలజ, మండల కో- ఆప్షన్‌ సభ్యుడు ఖిజర్‌, తదితరులున్నారు. 


VIDEOS

logo