ప్రగతికే ప్రాధాన్యం

ఆసిఫాబాద్, జనవరి 26 : ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందించడంతో పాటు అభివృద్ధి వైపు అడుగులు వేయడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం పని చేస్తున్నదని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మంగళవారం 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లాలో సాధించిన ప్రగ తిని వివరించారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా 335 జీపీల్లో రూ.40.39 కోట్లు 15వ ఆర్థిక సంఘం ద్వారా విడుదల చేశారన్నారు. వ్యవసాయశాఖ ద్వారా రైతు బంధు పథకానికి వానకాలంలో 1,07,320 మంది రైతులకు గాను 1,06,629 ఖాతాల్లో రూ.188.98 కోట్లను జమ చేశామని పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా ఇప్పటి వరకు 3,789 దరఖాస్తులు స్వీకరించామని, ఇందులో 2,602 మంది లబ్ధిదారులకు డబ్బులు మంజూరు చేసినట్లు తెలిపారు. రూర్బన్ పథకం కింద 66 పనులకు రూ.6.42 కోట్లు మం జూరు కాగా.. రూ.2.73 కోట్లతో 51 పనులు పూర్తి చేశామని పేర్కొన్నారు. డబుల్ బెడ్రూం పథకంలో 1,239 ఇండ్లకు టెం డర్ పిలువగా.. 519 ఇండ్లకు అగ్రిమెంట్ అయినట్లు తెలిపారు. ఆరోగ్య శాఖ ద్వారా 1,048 మంది క్షయవ్యాధిగ్రస్తులను గుర్తిం చి అందులో 857 మందికి రూ.500 చొప్పున అందిస్తున్నట్లు చెప్పారు. కొవిడ్-19 కట్టడిలో భాగంగా లక్షా 33 వేల 752 మందికి పరీక్షలు చేయగా.. వారిలో 2,458 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. ఇందులో 2,381 మంది కోలుకున్నారని, 77 మంది హోం ఐసొలేషన్‌లో ఉన్నట్లు వివరించారు. ఇప్పటి వరకు 2,162 మందికి కొవిడ్ టీకా వేశామన్నారు. జిల్లాలో 48,364 మందికి ఆసరా పింఛన్ అందుతున్నదని, 3,152 స్వయం సహాయక సంఘాలకు రూ.96.48 కోట్ల రుణాలను మంజూరు చేశామన్నారు. స్త్రీనిధి ద్వారా ఇప్పటి వరకు రూ.13.30 కోట్ల రుణం అందించినట్లు పేర్కొన్నారు. మిషన్ భగీరథ ద్వారా 1,151 ఆవాసాలకు నీరు సరఫరా అవు తుందన్నారు. పరిశ్రమల శాఖ ద్వారా 118 మందికి ఉపాధి కల్పించేందుకు అనుమతులు పొందినట్లు తెలిపారు. అం తకుముందు సాయుధ పోలీసు బలగాల గౌరవ వందనం స్వీక రించారు. వివిధ శాఖల్లో ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసా పత్రాల ను అందజేశారు. స్వాతంత్య్ర సమరయోధుడు శ్రీనివాస్ రావును, జైనూర్ మండలం మార్లవాయికి చెందిన గోండు కళా కారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజును ఘనంగా సత్క రించారు. తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య కళాకారులు పాడిన దేశభక్తి గీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఏ ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర, ఏఆర్ఎస్పీ సురేశ్, అటవీశాఖ అధికారి శాంతారాం, డీఎస్పీ అచ్చేశ్వర్రావు, అదనపు కలెక్టర్ రాం బాబు, డీఆర్వో కదం సురేశ్, ఆర్డీవో సిడాం దత్తు, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారి రాజ్యలక్ష్మి, టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి, జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్రావు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వనజ, వైస్ చైర్మన్ గాదవేణి మల్లేశ్, రెబ్బెన జడ్పీటీసీ సంతోష్ పాల్గొన్నారు.