ఆదివారం 07 మార్చి 2021
Komarambheem - Jan 25, 2021 , 00:58:55

పురుగుల మందు తాగి ఒకరి ఆత్మహత్య

పురుగుల మందు తాగి ఒకరి ఆత్మహత్య

కెరమెరి, జనవరి24 : మండలంలోని సావర్‌ఖేడ్‌ గ్రామానికి చెందిన గుర్నులే లక్ష్మణ్‌(55) పురుగుల మందు తాగి శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ రమేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం లక్ష్మణ్‌కు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు వివాహం చేశాడు. ఓ కూతురికి  ఇటీవల విడాకులు కావడంతో ఇంటివద్దే ఉంటున్నది.  ఆర్థిక ఇబ్బందులతో పాటు కూతుళ్ల పెండ్లిలు ఎ లా చేయాలని బెంగ పెట్టుకున్నాడు. శనివారం రాత్రి చేను వద్దకు కాపలా కోసం వె ళ్లాడు. ఆదివారం ఉదయం ఇంటి రాకపోవడంతో, కుటుంబ సభ్యులు చేను వద్దకు వెళ్లి చూడగా, పురుగుల మందు తాగి పడి ఉన్నాడు. వెంటనే లక్ష్మణ్‌ను ఆసిఫాబాద్‌ దవాఖానకు తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందాడని వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. 

VIDEOS

logo