గురువారం 04 మార్చి 2021
Komarambheem - Jan 20, 2021 , 01:52:05

పల్లెప్రగతి పనులపై నిర్లక్ష్యం వద్దు

పల్లెప్రగతి పనులపై నిర్లక్ష్యం వద్దు

  • జడ్పీ సీఈవో సాయాగౌడ్‌

దహెగాం, జనవరి19 : పల్లెప్రగతి పనుల నిర్మాణాలపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని జడ్పీ సీఈవో సాయాగౌడ్‌ ఆదేశించారు. మంగళవారం మండల పరిషత్‌ కార్యాలయంలో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్‌ సిబ్బందితో పల్లెప్రగతిలో చేపట్టిన పనులపై గ్రామ పంచాయతీల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్మశానవాటికలు, డంప్‌ యార్డులు, రైతువేదికలు, కల్లాలు, ప్రకృతి వనాల పనులను శనివారం లోగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఎంపీడీవో సత్యనారాయణ, ఎంపీవో రాజేశ్వర్‌గౌడ్‌, ఏపీవో చంద్రయ్య పాల్గొన్నారు.

VIDEOS

logo