పాఠశాలల్లో కొవిడ్-19 నిబంధనలు అమలు చేయాలి

- కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్‌రాజ్
ఆసిఫాబాద్, జనవరి19 : కొవిడ్-19 నిబంధనలను పాటిస్తూ పాఠశాలల్లో విద్యాబోధన చేయాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆదేశించారు. ఫిబ్రవరి1 నుంచి పాఠశాలలు, కళాశాలలు ప్రారంభంకానున్న నేపథ్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని రాజేంద్రప్రసాద్ బీఎడ్ కళాశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు, ఉపాధ్యాయులు భౌతిక దూరాన్ని పాటించాలని, మాస్క్‌లను తప్పనిసరిగా ధరించాలని సూచించారు. పాఠశాలలోని ప్రతి తరగతి గదిలో 20 మంది విద్యార్థులు ఉండేలా చూడాలన్నారు. జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శ్రీధర్‌సుమన్, గిరిజన సంక్షేమాధికారి మనెమ్మ, డీపీవో రమేశ్, అసిస్టెంట్ కమిషన్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ సెక్టోరియల్ అధికారి ఉదయ్‌బాబు, సైన్స్ అధికారి కటుకం మధూకర్, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల ప్రధానోపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- అసెంబ్లీకి ఎడ్లబండ్లపై వచ్చిన ఎమ్మెల్యేలు..
- బెంగాల్ పోరు : నందిగ్రాం బరిలో దీదీపై సువేందు అధికారి పోటీ!
- వాణీదేవి గెలుపే లక్ష్యంగా డివిజన్ల వారీగా ఇన్ఛార్జీల నియామకం
- అనంతగిరి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ పనితీరుపై సమీక్ష
- పైలట్‌పై పిల్లి దాడి.. విమానం అత్యవసర లాండింగ్
- ఇంజినీరింగ్ విద్యార్థులకు భావోద్వేగ, సామాజిక నైపుణ్యాలు అవసరం: వెంకయ్యనాయుడు
- ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యానని ముఖాన్నే మార్చేసుకున్నాడు
- బట్టతల దాచి పెండ్లి చేసుకున్న భర్తకు షాక్ : విడాకులు కోరిన భార్య!
- అందరూ లేడీస్ ఎంపోరియం శ్రీకాంత్ అంటున్నరన్న..జాతిరత్నాలు ట్రైలర్
- వీడియో : కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకోండిలా...