గురువారం 04 మార్చి 2021
Komarambheem - Jan 20, 2021 , 01:52:28

ఆయిల్‌ పామ్‌తో మంచి లాభాలు

ఆయిల్‌ పామ్‌తో మంచి లాభాలు

  • తెలంగాణలో సాగు లక్ష్యం 20 లక్షల ఎకరాలు 
  • రైతులు ప్రత్యేక దృష్టి సారించాలి
  • వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి
  • చెన్నూర్‌లో పంట పరిశీలన

చెన్నూర్‌ రూరల్‌ : భారతదేశంలో నంబర్‌ వన్‌ పంట ఆయిల్‌ పామ్‌ పంటేనని, దీని ద్వారా మం చి లాభాలున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి పేర్కొన్నారు. చెన్నూర్‌ మండలం సుబ్బరాంపల్లి సమీపంలోని ఆయిల్‌ పామ్‌ పంటను ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌తో కలిసి మంగళ వారం పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ పంట సాగును సర్కారు ప్రోత్సహిస్తున్నదని పేర్కొన్నారు. నాలుగేళ్లు రైతులు కష్టపడితే ఆరో సంవత్సరం నుంచి లాభాలు వస్తాయని పేర్కొ న్నారు. కేంద్రం చట్టం ద్వారా ఆయిల్‌ పామ్‌ పం టలకే మద్దతు ధర కల్పించిందని తెలిపారు. తెలంగాణలోని 25 జిల్లాల్లోని భూములు ఆయిల్‌ పామ్‌ సాగుకు అనుకూలంగా ఉన్నాయని, 20 లక్షల ఎకరాల్లో సాగు చేసేందుకు సర్కారు లక్ష్యం గా పెట్టుకుందని పేర్కొన్నారు. చెన్నూర్‌ నియోజ కవర్గంలో 400 ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగు చేస్తున్నారని, రెండు నెలలో 800 ఎకరాల్లో ఆయి ల్‌ పామ్‌ సాగయ్యేలా చూడాలని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌కు మంత్రి సూచించారు. ఆయిల్‌ పామ్‌ మొక్కలు చక్కగా పెరిగాయని రైతు వెన్న పురెడ్డి బాపురెడ్డిని మంత్రి అభినందించారు. ఎంపీపీ మంత్రి బాపు, జడ్పీటీసీ మోతె తిరుపతి, వైస్‌ ఎంపీపీ బాపురెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్య క్షుడు మల్లెల దామోదర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బత్తుల సమ్మయ్య, వైస్‌ చైర్మన్‌ సమ్మ య్య, డైరెక్టర్‌ భాస్కర్‌ రెడ్డి, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్‌ రత్న సమ్మిరెడ్డి, నాయకులు రాంలా ల్‌ గిల్డా, అయిత సురేశ్‌రెడ్డి, నరసింహాచారి, ఇన గంటి వెంకటేశ్వర్‌రావు, బుర్ర రాకేశ్‌గౌడ్‌, కౌన్సిల ర్లు రేవెల్లి మహేశ్‌, శ్రీను, నాయకులు, తదితరులు ఉన్నారు.


VIDEOS

logo